ఎలక్ట్రిక్ వాహనాలు ప్రస్తుత తరుణంలో చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తక్కువ ధరలకే ఆకట్టుకునే ఫీచర్లను కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీలు తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారు కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. అవేమిటంటే..
* ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాల్సిన పనిలేదు. అందువ్లల మెయింటెనెన్స్ ఉండదు.
* ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీలను మెయింటెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి 1,60,000 కిలోమీటర్ల దూరం వచ్చాక మెయింటెయిన్ చేయించాలి.
* పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల టైర్లు చాలా త్వరగా దెబ్బ తింటాయి. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
* ఎలక్ట్రిక్ వాహనాలకు చెందిన బ్రేక్‌లకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. దీని వల్ల బ్యాటరీ చార్జ్ అవుతుంది.
* ఎలక్ట్రిక్ వాహనాలు అయినా సరే కంపెనీ సూచించిన వ్యవధిలో సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది.
* ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీతో నడుస్తాయి కనుక బ్యాటరీ కండిషన్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. లేదంటే మార్గ మధ్యలో వాహనం ఆగిపోతే ఇక దాన్ని వేరే వాహనంతో టోయింగ్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. కనుక ప్రయాణించే ముందే బ్యాటరీ కండిషన్‌ను చెక్ చేసుకుంటే మేలు.
* ఎలక్ట్రిక్ టూవీలర్లు లేదా కార్లు ఏవైనా సరే వాటి బ్యాటరీ కెపాసిటీకి అనుగుణంగా మైలేజీని ఇస్తాయి. టూవీలర్లు అయితే సుమారుగా 100-150 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. అదే కార్లు అయితే 400 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తాయి. కనుక ఎంత మైలేజీ వస్తుందో ముందుగానే చెక్ చేసుకుని కొంటే చక్కని మైలేజీ ఇచ్చే వాహనాన్ని పొందవచ్చు.
* ఎలక్ట్రిక్ వాహనాలకు ఇచ్చే బ్యాటరీలను తీసి చార్జింగ్ పెట్టవచ్చు. కొన్నింటికి ఆ ఆప్షన్ ఉండదు. కనుక ఈ విషయం తెలుసుకోవాలి.
* ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ ముఖ్యం కనుక వేగంగా చార్జింగ్ అయ్యే బ్యాటరీ ఉండే వాహనాలను కొనుక్కుంటే మేలు. దీంతో ఎమర్జెన్సీ సమయాల్లో కొంత సేపు చార్జింగ్ పెట్టినా ఎక్కువ దూరం వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.