టోక్యో ఒలంపిక్స్ : నిరాశ పరిచిన కమల్ ప్రీత్ కౌర్

-

టోక్యో ఒలంపిక్స్ మహిళల డిస్కస్ త్రో ఫైనల్ పోరు లో భారత్ కు నిరాశ మిగిలింది. ఫైనల్ లో  ఆరో స్థానానికి పరిమితమైన కమల్ ప్రీత్ కౌర్ కు… చివరికి పోరులో నిరాశే మిగిలింది. ఈ టోక్యో ఒలంపిక్స్ లో ఎలాగైనా పతకం తీసుకు వస్తుందని అందరూ ఆశ పెట్టుకున్న… కమల్ ప్రీత్ కౌర్ పోరాటం ఇవాళ్టి తో ముగిసింది.

ఆరు రౌండ్లు ముగిసే సరికి… కమల్ ప్రీత్ కౌర్ ఆరో స్థానం లో నిలిచింది. దీంతో… కమల్  ప్రీత్ కౌర్ ఒలంపిక్స్ పయనం ముగిసిపోయింది. ఇక అటు అమెరికా దేశానికి చెందిన ప్లేయర్ అల్మన్ మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. అలాగే… జర్మనీ దేశానికి చెందిన ప్లేయర్ ఫుడెంజ్ రెండవ స్థానంలో నిలవగా… మూడవ స్థానంలో క్యూబా దేశానికి చెందిన ప్లేయర్ ఫురేజ్ నిలిచింది. ఆరో స్థానానికి పరిమితమైన కమల్ ప్రీత్ కౌర్ టోక్యో ఒలంపిక్స్ నుంచి వైదొలిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version