చాలా మంది ప్రతిరోజూ గూగుల్ ని వాడుతూ ఉంటారు. ఏ చిన్న సమాచారం కావాలన్నా కూడా వెంటనే గూగుల్ లో వెతుకుతూ ఉంటారు. జిమెయిల్ అకౌంట్ తో మరిన్ని సేవలు నీ ఫీచర్లని గూగుల్ ద్వారా పొందొచ్చు ఈ రోజుల్లో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వ్యక్తిగత వివరాలు బ్యాంక్ ఆర్థిక వ్యాపార వివరాలు సైబర్ మోసగాళ్ల చేతిలో పడే అవకాశం ఉంటుంది.
పాస్వర్డ్ వంటివి మోసగాళ్లు దోచుకునే అవకాశం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కనుక మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ అయిందేమో అని మీకు డౌట్ ఉంటే ఇలా తెలుసుకోవచ్చు. దీని కోసం google.com/devices కి వెళ్లండి. ఇక్కడ మీరు మీ సందేహాన్ని క్లియర్ చేసేసుకోవచ్చు.
మీ ఫోన్ లో సెట్టింగ్స్ ఆప్షన్స్ లోకి వెళ్లండి. అక్కడ కిందకి స్క్రోల్ చేసి “గూగుల్” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు కొత్తగా మరో విండో ఓపెన్ అవుతుంది.
అక్కడ “Mangage Your Google Account” పై క్లిక్ చేయండి.
ఇక్కడ పైన “Security” ఆప్షన్ ని చూడండి. ఆ తరవాత “Your Devices” ఆప్షన్ లోకి వెళ్ళండి.
“Manage All Devices” ఆప్షన్‌పై క్లిక్ చేసుకోండి. మీ గూగుల్ అకౌంట్ ఏయే డివైజ్‌లో లాగిన్ అయ్యిందో ఇక్కడ చూడండి.
ఇక్కడ మీరు వాడని డివైజ్ ఏదైనా చూస్తే వెంటనే దానిపై క్లిక్ చేయండి. “Sign Out” మీద నొక్కండి.