ఎండలు మండుతున్న వేళ బయటికి అడుగు పెడితే చాలు , చల్లటి పండ్ల రసాలు తాగలనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడ తాగితే ఆరోగ్యం ఏమవుతుందోనన్న భయం వెంటాడుతూనే ఉంది.
అయితే బయటకి వెళ్ళేటప్పుడు మన దగ్గర సెల్ఫ్ బ్లెండింగ్ జ్యుసర్ ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా చిటికె లో మనమే జ్యుస్ చేసుకొని తాగేయచ్చు. దీని పనితీరు ఎలా ఉంటుందో ఒక సారి చూద్దాం.
మిక్సీ జార్ లా అడుగున బ్లేడులుండే ఈ బాటిల్ రీఛార్జ్ బల్ బ్యాటరీ లతో పనిచేస్తుంది. కోసిన రెండు పండ్ల కప్పుల ముక్కల్ని దీన్లో వేసి ఫ్రిజ్ లో పెట్టి , బయటికెళ్లేటప్పుడు తీసుకెళ్తే కావాల్సినప్పుడు కాసిని నీళ్లు పోసి బటన్ నొక్కగానే నిమిషంలో పండ్ల రసం తయారైపోతుంది.