హైదరాబాద్‌ మ్యాన్ హోల్స్ క్లీన్ చేయ‌డానికి డ్యూటీ ఎక్కిన రోబో..

-

హైదరాబాద్‌లో మ్యాన్ హోల్స్‌ను క్లీన్ చేయడానికి కొత్తగా రోబో డ్యూటీలో చేరింది. గ్రేటర్ హైదరాబాద్‌లో మానవరహిత యంత్రాలతో పారిశుద్ద కార్యక్రమాల నిర్వహణలో భాగంగా మ్యాన్‌హోళ్ళును శుబ్రపరిచే రోబోటెక్ యంత్రాలను జిహెచ్‌ఎంసి మంగళవారం ప్రవేశ పెట్టింది. వాస్త‌వానికి కార్మికుల ద్వారా మ్యాన్‌హోళ్ళను శుభ్రపర్చడం వల్ల కార్మికులు తరచు అనారోగ్యం బారినపడటం, కొన్ని సార్లు మరణాలు కూడా సంభవించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

అందుకే రహేజా సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద ఈ రోబోను జీహెచ్‌ఎంసీకి అందించింది. 30 నుంచి 40 అడుగుల లోతులో ఉండే వ్యర్థాలను ఈ రోబో క్లీన్ చేస్తుంది. దీని పేరు.. బాండికూట్ రోబో. మ్యాన్‌హోల్స్ మరియు సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడానికి “టెక్నాలజీ అవలంబించిన పద్ధతులు” కలిగి ఉండాలని దేశంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది.

సుమారు రూ.32లక్షల విలువ చేసే ఈ రోబోటిక్ యంత్రాన్ని రహెజా సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమకూర్చినందుకు మేయర్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. బాండికూట్ అని వ్యవరహించే ఈ రోబోటెక్ యంత్రాన్ని శేరిలింగంపల్లి సమీపంలోని గౌసియా కేఫ్ వద్ద నగర మేయర్ బొంతురామ్మోహన్ లాంఛనంగా ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version