ఐ ఫోన్ యూజర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ ఇష్యూస్ వస్తే ఫ్రీ సర్వీస్..

-

యూత్‌తో పాటు స్మార్ట్ ఫోన్ లవర్స్‌కు యాపిల్ ఫోన్స్ అంటే చాలా ఇష్టముంటుంది. ముఖ్యంగా భారతదేశంలో ఐఫోన్స్‌కు బాగానే క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కాగా, తమ కస్టమర్స్ కోసం యాపిల్ సంస్థ కొత్త సర్వీస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. టెక్నికల్ ఇష్యూస్ వచ్చే యాపిల్‌ ఐఫోన్లకు ఫ్రీ రిపేర్​ సర్వీసు అందిస్తామని పేర్కొంది. ఇటీవల కాలంలో ఐఫోన్​ 12, ఐఫోన్​ 12ప్రో ఫోన్లలో సౌండ్​ సమస్యలు వస్తున్నట్లు కొంత మంది యూజర్ల నుంచి యాపిల్‌​ సంస్థకు ఫిర్యాదులు అందాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది యాపిల్ సంస్థ. ఈ క్రమంలోనే యూజర్లకు ఫ్రీ సర్వీస్ అందిస్తామని తెలిపింది.

Iphone 12 Phone
Iphone 12 Phone

ఈ సమస్యను తాము కూడా గుర్తించామని, రిసీవర్​ మోడల్​లోని కాంపోనెంట్స్ పనితీరు విఫలం అవ్వడం వల్ల యాపిల్‌​ ఫోన్లలో సౌండ్​ సంబంధిత సమస్యలు వస్తున్నాయని యాపిల్ సంస్థ పేర్కొంది. అక్టోబర్​ 2020 ఏప్రిల్​ 2021 మధ్య తయారైన ఫోన్లలోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని సంస్థ తెలిపింది. అయితే ఈ సమస్య వచ్చినప్పటికీ యూజర్స్ ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారికి ఉచితంగానే సర్వీసు అందిస్తామని యాపిల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే, ఈ ఉచిత ప్రోగ్రామ్‌కు అర్హత సాధించడానికిగాను మీరు మీ ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 12 ప్రోని గత రెండేళ్లలోనే కొనుగోలు చేసిన వారై ఉండాలి.

అంతకు ముందు కొనుగోలు చేసిన హ్యాండ్‌సెట్స్‌కు ఈ ఆఫర్​ వర్తించదు. ఇంతకు ముందు కూడా యాపిల్‌ ఫోన్లు, ఇతర డివైజెస్​లో ఇలాంటి సమస్యలను గుర్తించినట్లు సంస్థ పేర్కొంది. యాపిల్‌​ ఎయిర్‌పాడ్స్ ప్రోలో క్రాక్లింగ్, ఐప్యాడ్ ఎయిర్‌లో ఫౌల్టీ స్క్రీన్​, ఐఫోన్​ 11లో అన్​రెస్పాన్సివ్​ డిస్​ప్లే వంటి సమస్యలను తలెత్తినట్లు తెలిపింది. ఈ సమస్యలను పరిష్కరించుకునేందుకు యూజర్స్ యాపిల్‌​ సపోర్ట్‌ సెంటర్స్‌ను సంప్రదించాలని పేర్కొంది. యాపిల్‌​ స్టోర్‌ లేదా అధీకృత యాపిల్‌ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా సమస్యలకు పుల్​స్టాప్​ పెట్టొచ్చని వివరించింది. మీరు ఉపయోగించే ఐఫోన్లు ఈ రిపేర్​ ప్రోగ్రామ్​కు అర్హత ఉన్నాయో లేదో కూడా ఈ సెంటర్ల ద్వారానే తెలుసుకోవచ్చట. అయితే రిటైల్ సెంటర్లకు వెళ్లేవారు ముందుగా అపాయింట్​మెంట్ తీసుకొని వెళ్లాలని తెలిపింది. యాపిల్‌ అధికారిక సర్వీస్ సెంటర్ల నుంచి ఈ అపాయింట్​మెంట్ పొందొచ్చు. ఈ–మెయిల్ ద్వారా కూడా యాపిల్‌ సపోర్ట్ సర్వీస్​కు సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news