జీ-మెయిల్‌ యూజర్లకు అలర్ట్‌.. గూగుల్‌ షాకింగ్ నిర్ణయం..

-

జీ-మెయిల్‌ యూజర్లకు గూగుల్ షాకింగ్ న్యూస్ చెప్పింది. కనీసం రెండేళ్లకు మించి ఉపయోగించని జీ-మెయిల్‌, యూట్యూబ్‌ ఖాతాలను తొలగించాలని నిర్ణయించింది. వినియోగదారుల డేటా భద్రతను మరింత మెరుగు పరచడానికి ఈ మేరకు ఇన్‌యాక్టివ్‌ అకౌంట్‌ పాలసీలో మార్పులు చేసినట్లు చెప్పింది. ఈ మార్పులకు సంబంధించి యూజర్లకు ఇప్పటికే హెచ్చరిక సందేశాలు కూడా పంపిస్తోంది. ఖాతాను వెంటనే యాక్టివేట్‌ చేసుకోవాలని, లేదంటే వాటిని తొలగిస్తామని చెబుతోంది.

కొత్త విధానం డిసెంబరు 2023 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు గూగుల్‌ పేర్కొంది. ఈ లోగా యూజర్లు తమ ఖాతాలను పునరుద్ధరించుకోవాలని లేదంటే సంబంధిత ఖాతాతో ముడిపడి ఉన్న గూగుల్‌ డ్రైవ్‌, యూట్యూబ్‌, డాక్స్‌, మీట్‌, క్యాలెండర్‌, గూగుల్‌ ఫొటోలు తదితర డేటా మొత్తం డిలీట్‌ అవుతుందని పేర్కొంది. గూగుల్‌ తీసుకొచ్చిన ఈ కొత్త విధానం కేవలం వ్యక్తిగత ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని, పాఠశాలలు, గేమింగ్‌ సంస్థలు, వ్యాపార సంస్థలు తదితర ఆర్గనైజేషన్లకు వర్తించదని గూగుల్‌ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news