అలా చేస్తే గూగుల్ మీ కంటెంట్‌ను డిలీట్ చేస్తుంది జాగ్ర‌త్త‌..!

-

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ వ‌చ్చే ఏడాది జూన్ 1వ తేదీ నుంచి సరికొత్త పాల‌సీల‌ను అమ‌లు చేయ‌నుంది. గూగుల్ కు సంబంధించిన అనేక ర‌కాల ప్రొడ‌క్ట్స్ ను వాడేవారికి ఆ పాల‌సీలు వ‌ర్తిస్తాయి. జీమెయిల్‌, యూట్యూబ్‌, గూగుల్ డ్రైవ్‌, ఫొటోస్ త‌దిత‌ర సేవ‌ల‌ను పొందేవారు వ‌చ్చే ఏడాది నుంచి గూగుల్ ప్ర‌వేశ‌పెట్ట‌బోయే కొత్త పాల‌సీల‌ను అనుస‌రించాల్సి ఉంటుంది. ఈ మేర‌కు గూగుల్ తాజాగా ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది.

google will delete inactive users content

కొత్త పాల‌సీల ప్ర‌కారం గూగుల్ అకౌంట్ల‌లో 3 నుంచి 18 నెల‌ల పాటు ఇనాక్టివ్ ఉండే యూజ‌ర్ల‌కు గూగుల్ ఎప్ప‌టిక‌ప్పుడు మెసేజ్‌లు పంపుతుంది. ఇక 2 ఏళ్ల పాటు గూగుల్ అకౌంట్ల‌లోకి లాగిన్ అవ‌కుండా ఇనాక్టివ్‌గా ఉంటే ఆయా అకౌంట్ల‌ను, వాటిల్లో ఉండే కంటెంట్‌ను గూగుల్ ఆటోమేటిగ్గా డిలీట్ చేస్తుంది. ఫొటోలు, డాక్యుమెంట్స్‌, ఇత‌ర ఏ ఫైల్స్ అయినా స‌రే డిలీట్ అవుతాయి.

అలాగే 2 ఏళ్ల పాటు గూగుల్ అందించే స్టోరేజ్ లిమిట్ ను ఎప్ప‌టిక‌ప్పుడు క్లియ‌ర్ చేయ‌కుండా ఎప్పుడూ పూర్తిగా లిమిట్ దాటి ఉంటే.. అలాంటి అకౌంట్ల‌లో ఉండే కంటెంట్‌ను కూడా గూగుల్ డిలీట్ చేస్తుంది. అయితే ఈ రెండు సంద‌ర్భాల్లోనూ గూగుల్ కంటెంట్‌ను డిలీట్ చేసేముందు యూజ‌ర్ల‌కు ప‌లుమార్లు హెచ్చ‌రిక‌లు పంపుతుంది. అయినా స్పందించ‌క‌పోతే కంటెంట్ ఆటోమేటిగ్గా డిలీట్ అవుతుంది.

కాగా గూగుల్ ప్ర‌తి యూజ‌ర్‌కు 15జీబీ స్టోరేజ్‌ను ఉచితంగా అందిస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ లిమిట్ దాటితే యూజ‌ర్లు స్టోరేజ్ ప్లాన్ల‌ను ప్ర‌త్యేకంగా కొనాల్సి ఉంటుంది. ఇనాక్టివ్ గా ఉండే యూజ‌ర్ల వ‌ల్ల అన‌వ‌స‌రంగా స్పేస్ వృథా అవుతుంద‌ని భావిస్తున్నందునే గూగుల్ ఈ నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news