స్మార్ట్‌ఫోన్‌లో ఆటో బ్రైట్‌నెస్ ఫీచర్ ఎలా పని చేస్తుంది..? దీని వెనుక కారణం ఏమిటంటే..?

-

ఈ మధ్య కాలం లో చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ వలన మన పనులు ఎంతో ఈజీగా అయ్యిపోతాయి. అలానే ఈ ఫోన్స్ వలన చాలా లాభాలుంటాయి. స్మార్ట్ ఫోన్ లో ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ ఉంటాయి. ఈ ఫీచర్స్ తో మనకి ఎన్నో పనులు అవుతూ ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌లలో ‘ఆటో బ్రైట్‌నెస్’ అనే ఫీచర్ ఉంటుంది. మరి దీని కోసం ఈరోజు చూద్దాం.

ఈ ఫీచర్ వినియోగదారుల మొబైల్ స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు తగ్గించాలి అనేది చేస్తుంది. ఈ ఫీచర్ ఇప్పుడు Android, iOS ప్లాట్‌ఫారమ్‌లు రెండింటిలోనూ కూడా ఉంటోంది. అలానే ఈ ఫీచర్ ల్యాప్‌టాప్‌లు, మ్యాక్‌బుక్స్‌లలో కూడా ఉంటోంది. అయితే మరి ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.

స్మార్ట్‌ఫోన్‌లలో ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్, బేరోమీటర్ వంటి అనేక రకాల సెన్సార్‌లు ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. అయితే వీటిలో ఒకటి యాంబియంట్ లైట్ సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ వలన ఈ ఫీచర్ అనేది పని చేయడం జరుగుతుంది.యాంబియంట్ లైట్ సెన్సార్ మొబైల్ చుట్టూ ఎప్పుడు వెలుతురు ఉందో, ఎప్పుడు లేదో గుర్తించగలదు.

నిజానికి ఇది ఓ కెమెరా పని చేస్తుంది. ఇది మొబైల్ చుట్టూ ఉన్న కాంతిని చూస్తుంది. దీనితో లైటింగ్ ని పెంచాలా లేదా అనేది నిర్ణయిస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో బ్రైట్‌నెస్‌ సర్దుబాటు చేస్తుంది అలానే ఆపిల్‌లో ఉన్న ట్యూన్ టోన్ ఫీచర్ కూడా దీనికి హెల్ప్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news