వారెవ్వా..వాకింగ్ కారు.. ప్రత్యేకతలు ఏంటంటే?

-

వాకింగ్ కారు..ఈ పేరు వినడానికి వింతగా ఉంది కదూ..ఇప్పటివరకు డీజెల్,పెట్రోలు, గ్యాస్ తో నడిచే కారులను చూసి ఉంటారు.కానీ నడిచే కారును ఎప్పుడైనా చూశారా? అలాంటి కారు కూడా ఉంటుందా అనే డౌట్ రావడం కామన్.. అవును అండీ..మీరు విన్నది అక్షరాల నిజం..సరి కొత్త టెక్నాలజీ తో ఓ కారు ఇప్పుడు మార్కెట్లో సందడి చేయనుంది..ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్‌. స్టార్‌వార్స్‌లో సెల్యులాయిడ్‌పై కనిపించిన నడిచేకారును నేలమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది..

గత రెండేళ్ళ క్రితం కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షోలో ఆ కారు డిజైన్స్‌ను ప్రదర్శించిన ఆ సంస్థ కారు తయారీకోసం దాదాపు రూ.154 కోట్లతో మోంటానాలో అభివృద్ధి కేంద్రంను ఏర్పాటు చేసింది..అసలు ఆ కారు ప్రత్యేకతలు ఏంటంటే..నేల ఎలా ఉన్న ప్రయాణం చేస్తుంది. మిలిగిన కార్లు ఇంటి వరకూ తీసుకొని వెళతాయి..ఈ కారు మాత్రం మెట్లు కూడా ఎక్కుతుంది.గుట్టలు ఎక్కుతుంది.ఈ కారును ట్యాక్సీలా వాడితే.. వీల్‌చైర్‌ ఉపయోగించే వారు సులభంగా ట్రావెల్‌ చేయొచ్చు. భూకంపాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అక్కడినుంచి గాయపడినవారిని తరలించడం కష్టమవుతుంది.

అలాంటప్పుడు ఇది అంబులెన్స్‌లా పనిచేస్తుంది. రాళ్లు రప్పలు, గుట్టలు, మంచు గడ్డలు ఇలా నేలను బట్టి తన దిశను కూడా మార్చుకుంటుంది.ఇలాంటి స్పెషల్ ఫీచర్లు ఉన్న ఈ కారు మామూలు ప్రజలకు అందుబాటులో ఉంటుందా? లేదా అన్నది ధరను బట్టి తెలుస్తుంది. మొత్తానికి ఈ బుజ్జి కారు అందరినీ ఆకర్షిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news