చాలా మంది ఈ మధ్య కాలంలో ఇంస్టాగ్రామ్ ని ఉపయోగిస్తున్నారు. భారతదేశమంతటా కూడా ఇంస్టాగ్రామ్ ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఏడాది మరి కొన్ని కొత్త ఫీచర్లను ఇంస్టాగ్రామ్ తీసుకు రానుంది. ఫీడ్, వీడియో కాల్స్, 3d అవతార్ ఇలా కొత్త ఫీచర్లు కొన్ని రాబోతున్నాయి. అయితే మరి ఆ ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఫీడ్ లో ఆర్డర్:
కొత్త ఫీడ్ ఆప్షన్స్ ని ఇంస్టాగ్రామ్ తీసుకు రానుంది. రెండో ఆప్షన్లను ఇంస్టాగ్రామ్ తీసుకు రాబోతోంది. ఫాలోయింగ్ మరియు ఫేవరెట్స్ ఈ రెండు ఆప్షన్లు కూడా క్రానోలోజికల్ ఆర్డర్ లో ఉంటాయి.
వీడియో కాల్ లో స్క్రీన్ షేరింగ్:
స్క్రీన్ షేరింగ్ ఫీచర్ కూడా వీడియో కాల్ సమయంలో వస్తుంది అన్నట్లు వినపడుతోంది. అయితే మరి ఎప్పుడు వస్తుందో తెలియదు.
కొత్త ప్రొఫైల్ బ్యానర్:
కొత్త ప్రొఫైల్ బ్యానర్ గురించి ఇంస్టాగ్రామ్ అనౌన్స్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా అప్ కమింగ్ లైవ్ ఈవెంట్స్ గురించి స్టోరీలు ద్వారా షేర్ చేసుకోవచ్చు.
ఫీడ్ లో పోస్టులని మార్చుకోచ్చు:
ఫీడ్ లో ఉన్న పోస్టులని యూజర్లు తమకు నచ్చినట్లుగా అరేంజ్ చేసుకోవచ్చని ఈ ఫీచర్ను తీసుకు రానుంది. అయితే ఈ ఫీచర్ గురించి కేవలం ఈ విషయాలు మాత్రమే తెలుస్తోంది.
3d అవతార్:
త్రీ డీ అవతార్ అనే కొత్త ఫీచర్ కూడా రాబోతోంది. అలానే పెయిడ్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకు రాబోతోంది.
90 సెకండ్స్ రీల్:
90 సెకండ్స్ వీడియో లిమిట్ రీల్స్ కోసం ప్రత్యేకంగా ఈ ఫీచర్ ని తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్స్ తో ఇంస్టాగ్రామ్ మరెంత ఇంట్రెస్ట్ గా ఉండేలా కనపడుతోంది.