యూపీలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి రావాలిన ‘మాఫియా రాజ్’ కోరకుంటోందని.. ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వారు మళ్లీ ఎస్పీ అధికారంలోకి వస్తే… తమ దోపిడీ, దుర్మార్గాలను మళ్లీ మొదలుపెడుతారని ఆయన ప్రజలను హెచ్చరించారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజ్నోర్ లో జరిగిన సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వాళ్లకు తెలిసిందల్లా తమ అధికార దాహం తీర్చుకోవడమే అని విమర్శించారు.
యూపీలో గత ఐదేళ్ల కాలంలో సీఎం యోగీ పాలనలో నేరస్తులు జైళ్లకు పరుగుతీశారని.. బయట ఉన్నవాళ్లు కూడా తమను జైళ్లలో వేయాలని కోరారని మోదీ అన్నారు. వారికి ఇప్పుడు ఒకటే ఆశ ఉంది..ఎన్నికలు వస్తున్నాయి, ప్రభుత్వం మారాలి..మళ్లీ మేం బయటకు రావాలని కోరకుంటున్నారని మోదీ అన్నారు. ఇంతకుముందు యూపీలో మహిళలపై నేరాలు అనేకం జరిగేవని, పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని.. అలాంటిది యోగీ ప్రభుత్వం మహిళలకు విముక్తి కలిపించిందని ఆయన అన్నారు. యుపి అభివృద్ధిలో,వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రైతులకు అన్ని విధాలా సహాయం అందేలా మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మోదీ అన్నారు.