జోకర్‌ వైరస్‌ మళ్లీ వచ్చింది.. ఈ 15 యాప్స్ ఫోన్లో‌ ఉంటే వెంటనే తొలగించేయండి.!

-

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ యాప్ అయినా ఫ్రీగానే వేసుకోవచ్చు. మన అవసరాలకు తగ్గట్టు ఏదిపడితే అది ఇన్స్ స్టాల్ చేసుకుంటూ ఉంటాం. దీన్ని లక్ష్యంగా చేసుకుని..జోకర్ వైరస్ ఈ ఏడాది జూలైలో వణికించింది. ఇప్పుడు మళ్లీ ఈ వైరస్ గూగుల్ ప్లే స్టోర్ లో వచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లే దీనికి ఎర. దీనిపై గూగుల్ కూడా ఓ కీలక ప్రకటన చేసింది. ఈ మాల్వేర్ ఆండ్రాయిడ్ యాప్ లలో దాగి ఉందని, మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ 15యాప్స్ ఉంటే వెంటనే వాటిని తీసేయాల్సింది పేర్కొంది.

కాస్పెర్క్సీ ల్యాబ్స్‌లోని ఆండ్రాయిడ్‌ మాల్వేర్‌ అనలిస్ట్‌ టాట్యానా షిష్కోవా ఈ వైర్‌ను గుర్తించినట్లు ట్విటర్ ద్వారా‌ వెల్లడించింది. అయితే ఈ ప్రమాదకరమైన వైరస్‌ 2017లో బయటపడింది. ఈ వైరస్ చేసే మొదటిపని.. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో వినియోగదారునికి తెలియకుండానే విలువైన డేటాను తస్కరిస్తుంది. ఈ వైరస్‌ ఇప్పుడు మళ్లీ ఆండ్రాయిడ్‌ యాప్‌లలో వచ్చి చేరడంతో అందరిలో ఆందోళన నెలకొంది. ప్రమాదానికి గురైన 15 యాప్స్‌ను గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. ఇప్పటికే.. మీమీ ఫోన్‌లలో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే తొలగించుకోవాలని, లేకపోతే మీ డేటా ప్రమాదంలో ఉండే అవకాశం ఉంటుందని గూగుల్ హెచ్చరిస్తోంది గూగుల్‌. దీనివల్ల డేటా చోరీజరగటమే కాదు.. ‌ వినియోగదారును అనుమతి లేకుండానే డేటా సేకరించి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తుంది. యూజర్లు ఈ 15 యాప్స్ ను డిలీట్ చేస్తే మీ డేటాకు భద్రత ఉటుందని గూగుల్ వెల్లడిస్తోంది.

జోకర్‌ మాల్వేర్‌ సోకిన యాప్స్‌ ఇవే..

1. Easy PDF Scanner
2. Blender Photo Editor-Easy Photo Background Editor
3. Now QR Code Scan
4. Super-Click VPN
5. Flashlight Flash Alert on Call
6. Halloween Coloring
7. Volume Booster Louder Sound Equalizer
8. Battery Charging Animation Bubble Effects
9. Smart TV Remote
10. Volume Boosting Hearing Aid
11. EmojiOne Keyboard
12. Classic Emoji Keyboard
13. Super Hero-Effect
14. Dazzling Keyboard
15. Battery Charging Animation Wallpaper

మీ ఫోన్లు ఫోన్లలో ఈ యాప్స్ ఉంటే వెంటనే తొలగించండి. మీ ఆత్మీయుల ఫోన్లలో కూడా ఉండే అవకాశం లేకపోలేదు..ఈ ఆర్టికల్ షేర్ చేసి వారిని జాగ్రత్తపరచండి.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news