జోక‌ర్ వైర‌స్ : ఏడాది కింద‌ట పోయింద‌నుకున్నారు.. మ‌ళ్లీ వైపిస్తుంది..

-

ఆండ్రాయిడ్ యాప్‌ల‌పై ప్ర‌మాద‌క‌ర‌మైన జోక‌ర్ వైర‌స్ మ‌ళ్లీ దాడి చేస్తోంది. జూలై 2020లో జోక‌ర్ వైర‌స్ గూగుల్ ప్లే స్టోర్‌లోని 40 ఆండ్రాయిడ్ యాప్‌ల‌పై దాడి చేసింది. దీంతో ఆ వైర‌స్ ఇన్‌ఫెక్ట్ అయిన యాప్‌ల‌ను గూగుల్ త‌న ప్లే స్టోర్ నుంచి తొల‌గించింది. కానీ అదే జోక‌ర్ వైర‌స్ మ‌ళ్లీ వ్యాప్తి చెందుతోంది. ఈ వైర‌స్ యూజర్ల‌కు చెందిన డేటాను వారికి తెలియ‌కుండానే సేక‌రిస్తోంది. యూజ‌ర్ల‌కు చెందిన మెసేజ్‌లు, కాంటాక్ట్ లిస్ట్‌, డివైస్ స‌మాచారం, ఓటీపీల‌ను సేక‌రించి హ్యాక‌ర్ల‌కు చేర‌వేస్తోంది.

జోక‌ర్ వైర‌స్

కాగా ప్ర‌స్తుతం జోక‌ర్ వైర‌స్ 8 యాప్‌ల‌కు వ్యాప్తి చెందింది. అవి.. Auxiliary Message, Fast magic SMS, Free CamScanner, Super Message, Element Scanner, Go messages, travel wallpapers, Super SMS.. కాగా ఈ యాప్‌ల‌ను కూడా గూగుల్ త‌న ప్లే స్టోర్ నుంచి తొల‌గించింది. అయితే ఇప్ప‌టికే ఫోన్ల‌లో ఈ వైర‌స్ ఉన్న‌వారు వెంట‌నే ఫోన్‌ను ఫ్యాక్ట‌రీ సెట్టింగ్స్‌కు రీసెట్ చేయ‌డ‌మో లేక యాంటీ వైర‌స్ యాప్‌ల‌తో ఫోన్‌ల‌ను స్కాన్ చేయ‌డ‌మో చేయాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

జోక‌ర్ అనేది నిజానికి ఓ మాల్‌వేర్ ట్రోజ‌న్‌. అది ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌ను టార్గెట్ చేస్తుంది. ఫోన్ల‌లోని యాప్‌లకు వ్యాప్తి చెందుతుంది. ఈ క్ర‌మంలోనే గ‌తేడాది జూలైలో జోక‌ర్ వైర‌స్ ఇన్‌ఫెక్ట్ అయిన 11 యాప్‌ల‌ను, అక్టోబ‌ర్‌లో 34 యాప్‌ల‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొల‌గించింది. అయితే ఈ వైర‌స్ ఇన్‌ఫెక్ట్ అయిన యాప్‌ల‌ను ఇప్ప‌టికే 1.20 ల‌క్ష‌ల సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నార‌ని సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ జ‌డ్‌కాల‌ర్ వెల్ల‌డించింది.

జోక‌ర్ వైర‌స్ వ్యాప్తి చెందిన ఇత‌ర యాప్‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

All Good PDF Scanner, Mint Leaf Message-Your Private Message, Unique Keyboard Fancy Fonts & Free Emoticons, Tangram App Lock, Direct Messenger, Private SMS, One Sentence Translator Multifunctional Translator, Style Photo Collage, Meticulous Scanner, Talent Photo Editor Blur focus, Care Message, Part Message, Paper Doc Scanner, Blue Scanner.

ఈ యాప్ లు ఫోన్‌లో ఉంటే వెంట‌నే తీసేయాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news