పలు రకాల కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలు.. నవంబరు 1 నుంచి అమలు

-

ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌ పీసీలు వంటి మరికొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆంక్షలు నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) తెలిపింది. హెచ్‌ఎస్‌ఎన్‌ 8741 విభాగం కిందకు వచ్చే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌ పీసీలు, వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతులపై గురువారం ఆశ్చర్యకరరీతిలో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆయా పరికరాల్లో భద్రత రీత్యా లోపాలున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. దేశీయ తయారీని ప్రోత్సహించేందుకూ ఇది ఉపకరిస్తుందని ప్రభుత్వం వివరించింది.

అయితే తక్షణం ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయని పేర్కొనడంతో పరిశ్రమ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఈ నేపథ్యంలోనే, ప్రభుత్వం స్పందించింది. నూతన విధానం అమలును అక్టోబరు 31 వరకు నిలిపేస్తున్నట్లు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. లైసెన్స్‌ లేకుండానే దిగుమతులను 2023 అక్టోబరు 31 వరకు అనుమతిస్తామని డీజీఎఫ్‌టీ వెల్లడించింది. లైసెన్స్‌ ఉంటేనే నవంబరు 1 నుంచి ల్యాప్‌టాప్‌లు దిగుమతి చేసుకునేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ట్యాబ్లెట్‌ పీసీలు, సర్వర్ల వంటివి దిగుమతి చేసుకునేందుకు సుంకం కూడా చెల్లించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news