రాజ్ భవన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత

-

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకువచ్చిన ఆర్టీసీ బిల్లును రాజ్ భవన్ పెండింగ్ లో ఉంచింది. బిల్లు పరిశీలనకు మరికొంత సమయం అవసరమని గవర్నర్ తమిళిసై ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వని క్రమంలో కార్మిక సంఘాలు బిల్లు త్వరగా ఆమోదించాలని కోరుతున్నారు.

శనివారం ఆర్టీసీ యూనియన్ సంఘాలు రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్మికులను అడ్డుకునేందుకు రాజ్ భవన్ పరిసరాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ చేరుకునే మార్గాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news