ప్రముఖ కంపెనీ ఆసుస్ ప్రోడక్ట్స్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే..కస్టమర్ల అభిరుచికి తగ్గట్లు కొత్త కొత్త ఫీచర్ల తో ల్యాప్ టాప్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తుంది.తాజాగా మరో మూడు ల్యాప్ టాప్స్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది..ఆసుస్ జెన్‌బుక్ 14 ఫ్లిప్ ఓఎల్‌ఈడీ, ఆసుస్ వివోబుక్ ఎస్ 14 ఫ్లిప్, ఆసుస్ వివో బుక్ 15 2022, ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. జెన్‌బుక్ 14 ఫ్లిప్ ఓఎల్ఈడీ, వివోబుక్ ఎస్ 14 ఫ్లిప్ మోడళ్లు ఇంటెల్, ఏఎండీ ప్రాసెసర్ వేరియంట్లలో విడుదలయ్యాయి. వీటితో పాటు వివోబుక్ 15 మోడల్ కూడా టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆసుస్ నుంచి కొత్తగా లాంచ్ అయిన ఈ ల్యాప్‌టాప్‌ల ధరలు, స్పెసిఫికేషన్లను ఒకసారి చుద్దాము..
ఆసుస్ జెన్‌బుక్ 14 ఫ్లిప్ ఓఎల్ఈడీ స్పెసిఫికేషన్లు..
90Hz రిఫ్రెష్ రేట్ ఉండే 14 ఇంచుల OLED టచ్ స్క్రీన్‌తో ఈ ల్యాప్‌టాప్ వస్తోంది. 550 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. 360 డిగ్రీల వరకు మడత పెట్టగల ఎర్గోలిఫ్ట్ హింగ్ డిజైన్‌ను ఈ ల్యాప్‌టాప్ కలిగి ఉంది. 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7, కోర్ ఐ5, AMD రైజన్ 5,7, 9 ప్రాసెసర్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. గరిష్ఠంగా 16జీబీ వరకు LPDDR5 ర్యామ్, 1TB వరకు SSD స్టోరేజ్ ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌కు రెండు యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌లు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉంటుంది. 63Whr సామర్థ్యమున్న బ్యాటరీ ఈ ల్యాప్‌టాప్‌లో ఉండగా.. 100వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది..దీని బరువు 1.5 కేజీలుగా ఉంది.
ఆసుస్ వివోబుక్ ఎస్ 14 ఫ్లిప్ స్పెసిఫికేషన్లు..
ఈ ఆసుస్ వివో బుక్ ఎస్ 14 ఫ్లిప్ ల్యాప్‌టాప్ కూడా 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ రెజల్యూషన్ టచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ట్యాబ్‌గా, ల్యాప్‌టాప్‌గా వినియోగించుకునేలా 2 ఇన్ 1 సదుపాయం ఉంటుంది. AMD రైజన్ 5, ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ వేరియంట్లలో వస్తోంది. రెండు మోడల్స్ 16జీబీ వరకు LPDDR4 ర్యామ్‌ను కలిగి ఉంటాయి. 512జీబీ వరకు SSD స్టోరేజ్ ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 50Whr బ్యాటరీ ఉంటుంది. 90వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.
ఆసుస్ వివో బుక్ 15 స్పెసిఫికేషన్లు..
ఫుల్ హెచ్‌డీ టచ్ డిస్‌ప్లేతో ఆసుస్ వివోబుక్ 15 (2022) ల్యాప్‌టాప్ వస్తోంది. ఇంటెల్ కోర్ ఐ3, కోర్ ఐ5 ప్రాసెసర్ వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. గరిష్ఠంగా 16జీబీ వరకు LPDDR4 ర్యామ్, 512GB వరకు SSD స్టోరేజ్ ఉంటుంది.ఆసుస్ వివోబుక్ 15 ల్యాప్‌టాప్‌లో 42Whr బ్యాటరీ ఉండగా.. 65వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 1.7కేజీల బరువు ఉంటుంది.ఈ మూడు ల్యాప్‌టాప్‌లు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతాయి. ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్నాయి. వెబ్‌క్యామ్‌లకు ప్రైవసీ షటర్స్ కూడా ఉంటాయి..వైఫై,బ్లూటూత్, స్పీకర్లు వంటి స్పెషల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
వీటి ధరల విషయానికొస్తే..
ఆసుస్ జెన్‌బుక్ 14 ఫ్లిప్ ఓఎల్ఈడీ ప్రారంభ ధర రూ.99,990గా ఉంది. ఆసుస్ వివోబుక్ ఎస్ 14 ఫ్లిప్ రూ.66,990 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఆసుస్ వివోబుక్ 15 2022 ప్రారంభ ధర రూ.49,990గా ఉంది. ఈ-కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆసుస్ ఈ-షాప్స్, ఆసుస్ స్టోర్స్‌లో ఈ ల్యాప్‌టాప్‌లు సేల్‌కు అందుబాటులో ఉన్నాయి..ఆఫర్లను బట్టి ధరలు కూడా మారుతాయి..