ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్‌జీ డబ్ల్యూ41 సిరీస్‌లో 3 కొత్త స్మార్ట్ ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. డబ్ల్యూ41, డబ్ల్యూ41 ప్లస్, డబ్ల్యూ41 ప్రొ పేరిట ఆ మూడు ఫోన్లు విడుదలయ్యాయి. వాటిల్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
ఎల్‌జీ డబ్ల్యూ 41, డబ్ల్యూ41 ప్లస్, డబ్ల్యూ41 ప్రొ ఫీచర్లు…
* 6.55 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెసర్
* 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ (డబ్ల్యూ 41), 128జీబీ స్టోరేజ్ (డబ్ల్యూ41 ప్లస్), 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (డబ్ల్యూ41 ప్రొ)
* 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్
* 48, 8, 2, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్
* గూగుల్ అసిస్టెంట్ బటన్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఎల్‌జీకి చెందిన డబ్ల్యూ 41, డబ్ల్యూ41 ప్లస్, డబ్ల్యూ41 ప్రొ ఫోన్ల ధరలు వరుసగా రూ.13,490, రూ.14,490, రూ.15,490గా ఉన్నాయి. వీటిని దేశ వ్యాప్తంగా ఉన్న రిటెయిల్ స్టోర్లతోపాటు ఆన్‌లైన్‌లోనూ వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.