గూగుల్ నుంచి లుక్ టు స్పీక్ (Look to Speak) అనే ఓ కొత్త యాప్ వచ్చింది. ఈ యాప్ ద్వారా కళ్లతోనే చాట్ చేయోచ్చు. ముఖ్యంగా మాట్లాడలేని వారిని దృష్టిలో ఉంచుకొని గూగుల్ ఈ యాప్‌ను డెవలప్ చేసింది. తమ ఫోన్లలో ఉండే కొన్ని పదాలను కళ్లతో చూస్తే.. దానిని గట్టిగా చదివి వినిపిస్తుంది ఈ యాప్.
ఈ యాప్ ను వాడాలంటే మీరు మీ ఫోన్ ను కదలకుండా పట్టుకుని స్క్రీన్ పై కనిపించే పదాల వైపు చూడాలి. ఎడమ, కుడి, పై వైపు చూడటం ద్వారా అక్కడ ఉన్న పదాలను ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇందులో హలో, థ్యాంక్యూ, గ్రేట్, ఓకే లాంటి పదాలు ఉన్నాయి. అంతే కాకుండా అవతలి వ్యక్తి పేరు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఈ లుక్ టు స్పీక్ యాప్ ఆండ్రాయిడ్ 9.0, ఆపై వెర్షన్లు ఉన్న ఫోన్లకు అందుబాటులో ఉంది.