వారెవ్వా..చాలా చీప్ గా దొరికే లగ్జరి కారు వచ్చిందోచ్…

చాలా మంది డబ్బులు సంపాదించి మంచిగా తన ఫ్యామిలీని కార్లలో తిప్పాలి.తనని నమ్ముకున్న కుటుంబానికి ఎదైనా చేయాలని అనుకుంటారు..లక్షల విలువ చేసే కారు కాకుండా తక్కువ బడ్జెట్ లో కారు వస్తే బాగుండు అనుకుంటారు.అలాంటి వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. అతి తక్కువ ధర లో ఓ కారు మార్కెట్ లోకి వచ్చింది. ఆ కారు పూర్తీ వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొనుగోలు దారులు శుభవార్త చెప్పింది. సామాన్యులకు సైతం బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ వెహికల్స్ను వినియోగదారులకు అందిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది..మహీంద్రా ఆటమ్ పేరుతో కే1, కే 2,కే3. కే4 అనే నాలుగు వేరియంట్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ను మహీంద్రా సంస్థ మార్కెట్కు పరిచయం చేసింది. మొదటి రెండు కే1, కే3 వేరియంట్లు 7.4 కేడ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్తో, మిగిలిన కే2, కే4లు 11.1కే డ్ల్యూహెచ్ ప్యాక్తో రానున్నాయని తెలిపింది.

‌ఇక ఈ వెహికల్స్ పీక్ పవర్ అవుట్ పుట్ 11పీఎస్గా ఉంటుందని ఆ సంస్థ అధికారులు తెలిపారు.ఇన్ని అద్భుతమైన ఫీచర్స్ ఉన్న ఈ వెహికల్ ధర చాలా తక్కువ ధర దాదాపు రూ.3 లక్షలుగా ఉండొచ్చనేది మార్కెట్ విశ్లేషకుల అంచనా. మహీంద్రా ఆటమ్ గరిష్ట వేగం గంటకు 50 కి.మీ.గా ఉంటుంది. దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఒకసారి చార్జ్ చేస్తే 120-130 కిలో మీటర్లు ప్రయానిస్తుంది.