ఇప్పుడు ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్ కి ఈజీగా మారచ్చు తెలుసా..?

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ని వాడుతున్నారు. కొంతమందికి ఆండ్రాయిడ్ ఫోన్లు ఇష్టమైతే కొంత మందికి ఐఫోన్లు అంటే బాగా ఇష్టం. మీరు కూడా ఐఫోన్ వాడుతున్నారా..? ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ లోకి మారిపోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇప్పుడు అది చాలా సులభం ఆండ్రాయిడ్ లో డేటా ట్రాన్స్ఫర్ చేసుకునేలా స్విచ్ టు ఆండ్రాయిడ్ యాప్ త్వరలో రానుంది.

డేటా బదిలీ చేయడానికి ఎలాంటి కేబుల్ అవసరం లేకుండా వైర్లెస్ టెక్నాలజీ తో ఆ పని చేయచ్చు. స్విచ్ టూ ఆండ్రాయిడ్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ చెయ్యచ్చు. ఫోన్ లో కాంటాక్ట్స్, క్యాలెండర్, ఫోటోలు మొదలైనవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.

ఐక్లౌడ్ డేటాను కూడా గూగుల్ డ్రైవ్ లోకి బదిలీ చేసుకోవచ్చు. ఐ ఫోన్ లో ఐమెసేజెస్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో మెసేజ్లను పొందొచ్చు. కానీ ఐ ఫోన్ లో యాప్స్ ని మాత్రం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కుదరదు. మీరు ఈ యాప్ ని ఆపిల్ స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్విచ్ టు ఆండ్రాయిడ్ యాప్ వలన ఏ రిస్క్ ఉండదు.

ఐఓఎస్ 12 మరియు ఆ తరవాత వర్షన్ వాడే ఐఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. స్విచ్ టు ఆండ్రాయిడ్ యాప్ ద్వారా సులువుగా డేటా ని ట్రాన్స్ఫర్ చేసుకోచ్చు. ఈ యాప్ కనుక అందుబాటులోకి వస్తే ఐ ఫోన్ యూజర్స్ హెల్ప్ అవుతుంది.