భారీగా తగ్గిన Vivo V23e స్మార్ట్ ఫోన్ ధరలు.. ఆ క్రెడిట్ కార్డులతో ఇంకా డిస్కౌంట్..!

-

వీవో తన స్మార్ట్ ఫోన్ ధరలను తగ్గిస్తుంది. మొన్న Y21, Y21E ధరలను రూ. 500 వరకూ తగ్గించింది. ఇటీవలే మనదేశంలో లాంచ్ చేసిన వివో వీ23ఈ 5జీ స్మార్ట్ సమ్మర్ స్పెషల్ ఆఫర్‌ను అందించారు. దీంతో ఈ ఫోన్‌పై రూ.8,000 వరకు తగ్గింపులో లభించనుంది. ఈరోజు మనం ఈ ఫోన్ ఫీచర్స్, ప్రైస్ ఎంతో చూద్దాం.!

వివో వీ23ఈ 5జీ ధర

8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.28,990 కాగా… రూ.25,990కే విక్రయిస్తున్నారు.

ఆఫర్లు..

ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, వన్ కార్డు, ఎస్‌బీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.ఐదు వేలు క్యాష్ బ్యాక్ లభించనుంది. అంటే రూ.20,990కే ఈ ఫోన్ తీసేయొచ్చనమాట.

వివో వీ23ఈ 5జీ హైలెట్స్.

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై వివో వీ23ఈ 5జీ పనిచేస్తుంది.
ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా మరింత పెంచుకోవచ్చు.
బ్యాటరీ విషయానికి వస్తే.. 4050 ఎంఏహెచ్‌గా ఉంది. 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై వివో వీ23ఈ 5జీ పనిచేయనుంది.
సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించారు.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

కెమేరా ముచ్చటేంది..?

ఇందులో వెనకవైపు మూడు కెమేరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమేరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 44 మెగాపిక్సెల్ కెమేరాను అందించారు..

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news