అసుస్ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే అసుస్ జెన్‌ఫోన్ 9. కాస్ట్ రూ. 60 వేలు పైమాటే.. ఈ రేంజ్‌లో లాంచ్ చేసిన ఫోన్ స్పెసిఫికెషన్లు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బ్రాండెడ్ మొబైల్స్‌కు గట్టి పోటీనే ఇవ్వబోతుందని టెక్కీస్ అభిప్రాయం.. మనదేశంలో కూడా ఈ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. యాపిల్ తరహా చిన్న సైజులో ఆకట్టుకునే డిజైన్‌తో అసుస్ జెన్‌ఫోన్ 9 లాంచ్ కావడం విశేషం ఇంతకీ ఫోన్ వివరాలు ఎలా ఉన్నాయంటే..
అసుస్ జెన్‌ఫోన్ 9 ధర..
ఈ స్మార్ట్ ఫోన్ ధర 799 యూరోలు అంటే మన సుమారు రూ.64,800 నుంచి ప్రారంభం కానుంది.
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ వైట్, సన్‌సెట్ రెడ్, స్టారీ బ్లూ కలర్ ఆప్షన్లలో అసుస్ జెన్‌ఫోన్ 9 కొనుగోలు చేయవచ్చు.
అసుస్ జెన్‌ఫోన్ 9 స్పెసిఫికేషన్లు..
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో 5.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 120 హెర్ట్జ్ శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, పీక్ బ్రైట్‌నెస్ 1100 నిట్స్‌గా ఉంది.
హెచ్‌డీఆర్10, హెచ్‌డీఆర్10+ సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా అందించారు.
16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా ఇందులో ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
అడ్రెనో 730 జీపీయూని కూడా ఈ ప్రాసెసర్‌కు ఇంటిగ్రేట్ చేశారు.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, నావిక్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు.
యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, హాల్ సెన్సార్, మ్యాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి.
ఐపీ68 రేటింగ్ కూడా ఈ ఫోన్‌లో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్ కాగా, 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 18.5 గంటల వీడియో ప్లేబ్యాక్ టైంను, 8 గంటల గేమింగ్ టైంను ఇది అందిస్తుందట.
డ్యూయల్ మైక్రో ఫోన్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని మందం 0.91 సెంటీమీటర్లు కాగా, బరువు 169 గ్రాములుగా ఉంది.
కెమెరా క్వాలిటీ..
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. సిక్స్-యాక్సిస్ గింబల్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.