ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువ అయింది అనే చెప్పాలి. టెక్నాలజీ పెరగడం మరియు స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో ఎన్నో రకాల అప్లికేషన్ లు అందుబాటులో ఉంటున్నాయి. ఈ మధ్య వాట్సాప్ వినియోగం చాలా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు అనే చెప్పవచ్చు. పైగా ఎన్నో కొత్త ఫీచర్లను కూడా తీసుకువస్తూ ఉంటుంది. అదే విధంగా, తాజాగా కొత్త ఫీచర్ ను కూడా తీసుకురావడం జరిగింది, దీని ద్వారా డేటాను షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ మీడియాకు సంబంధించి డౌన్లోడ్ లపై వినియోగదారులకు మరింత నియంత్రణ ఇవ్వడానికి కొన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. ఈ విధంగా, కొత్త వెర్షన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ వెర్షన్ లో భాగంగా, యూజర్ల డివైస్ లో ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయ్యే ఫోటోలు, వీడియోల కు సంబంధించిన క్వాలిటీను ఎంచుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. కాకపోతే, ప్రస్తుతం ఈ అప్డేట్ కొన్ని బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది మరియు క్రమంగా ఈ ఫీచర్ ను వినియోగదారులకు అందజేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా, క్వాలిటీ కి సంబంధించిన ఆప్షన్ ను ఎంపిక చేసుకుని డేటాను ఆదా చేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించాలంటే, సెట్టింగ్స్ లోకి వెళ్లి స్టోరేజ్ అండ్ డేటా పై క్లిక్ చేసి, మీడియా ఆటో డౌన్లోడ్ క్వాలిటీ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
అక్కడ, స్టాండర్డ్ క్వాలిటీ మరియు హెచ్డీ క్వాలిటీ అనే రెండు రకాల ఆప్షన్ లు ఉంటాయి. స్టాండర్డ్ క్వాలిటీ లో డేటాను ఆదా చేసుకోవచ్చు మరియు వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. కాకపోతే, ఇక్కడ క్వాలిటీ తగ్గుతుంది. అదే హెచ్డీ క్వాలిటీ రిజల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, దీంతో ఎక్కువ డేటా మరియు ఎక్కువ స్టోరేజ్ ను మీడియా ఉపయోగిస్తుంది. కనుక, మీ వినియోగానికి అవసరమైన విధంగా ఈ ఆప్షన్ లను ఎంపిక చేసుకోవచ్చు అని వాట్సాప్ సంస్థ చెబుతోంది.