ఫుడ్ ను సేవ్ చేసే కొత్త టెక్నాలజీ మెషిన్..ఫీచర్స్ ఇవే..

-

మనం అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువ ఆహారాన్ని వండి, వృధాగా చెత్తకుండీలో వేస్తాము..ఆ తిండి లేక ఎంతో మంది బయట ఆకలి చావులు చని పోతున్నారు.అలాంటి వాటి నుంచి జనాలను రక్షించే ప్రయత్నం చేసింది నెదర్లాండ్స్‌కు చెందిన ఓ సంస్థ.. ఆ యంత్రం ఎంత ఫుడ్ వృధా అవుతుంది.ఎంత వరకూ వండితే ఇంట్లో అందరికి సరిపోతుంది..మొదలగు అంశాల గురించి మనకు చూపిస్తుంది. ఆ అద్భుతమైన టెక్నాలజీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

పండిస్తున్న ఆహార పదార్థాల్లో మూటింట ఒక వంతు చెత్తకుప్పల్లోకే వెళ్తోంది. మరోవైపు తినడానికి తిండి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతోన్నా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. అయితే ఈ ఫుడ్‌ వేస్టేజ్‌ సమస్యకు చెక్‌ పెట్టడానికి నెదర్లాండ్స్‌కు చెందిన ఓ సంస్థ వినూత్న ఆలోచన చేసింది..

ఆ దేశం లోని ఓర్‌బిస్క్‌ అనే సంస్థ ఓ వినూత్న పరికరాన్ని రూపొందించింది. చెత్తబుట్ట మీద అమర్చేలా ఉన్న ఈ పరికరానికి సెన్సర్‌ ఉంటుంది. దీంతో చెత్త వేసినప్పుడల్లా సెన్సర్‌ గమనిస్తుంటుంది. ఎంత ఆహారాన్ని పారేస్తున్నారు. ఎలాంటి ఆహారాన్ని పారేస్తున్నారు. ఏ సమయాల్లో వేస్తున్నారు లాంటి వివరాలన్నింటినీ నమోదు చేసుకుంటుంది. ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ఈ గ్యాడ్జెట్ డ్యాష్‌ బోర్డ్‌పై ఎప్పటికప్పుడు సమాచారాన్ని చూపిస్తుంది..దాన్ని చివరగా కొడీకరించి, ఇంట్లో వాళ్ళకు ఎంత ఆహారం అవసరం, ఎంత సేవ్ చేయాలి వంటి పూర్తీ సమాచారాన్ని అందిస్తుంది. దీని వల్ల కొంతవరకు ఫుడ్ వేస్టేజ్ అనేది తగ్గిందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version