లోగో మార్చిన నోకియా.. 60 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం

-

స్మార్ట్ ఫోన్ల ఎంట్రీతో డీలా పడిపోయిన నోకియాను చేజిక్కించుకున్న హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంటూ మళ్లీ పునర్వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే నోకియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్ల తర్వాత కంపెనీ కొత్త లోగోను డిజైన్‌ చేసింది. కంపెనీ కొత్త లోగోలో నోకియా అనే పదంలోని ఐదు అక్షరాలని వేర్వేరు రూపాల్లో రూపొందించారు. ఈ లోగో కంపెనీకి సరికొత్త వ్యాపార ప్రణాళికలను అందించడానికి సహాయపడుతుందని కంపెనీ సీఈవో పెక్కా లుండ్‌మార్క్‌ వెల్లడించారు.

బార్సిలోనాలో సోమవారం రోజున ప్రారంభమైన వార్షిక మొబైల్​ వరల్డ్​ కాంగ్రెస్​లో.. కంపెనీ వ్యాపార విస్తరణకు సంబంధించి సరికొత్త ప్రణాళికను వెల్లడించనున్నట్లు లుండ్​మార్క్ తెలిపారు.​ 2020లో కష్టాల్లో ఉన్న నోకియా కంపెనీ అధికారిక పగ్గాలు చేపట్టాక మూడు కీలక మార్పులకు వ్యూహాలు రచించినట్లు లుండ్​మార్క్ చెప్పారు. రీసెట్​, వేగవంతం చేయడం, అభివృద్ధి బాట పట్టించడం.. ఇందులో మొదటి దశ పూర్తి కావడం వల్ల ప్రస్తుతం రెండో దశ ప్రారంభమవుతోందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news