వ‌న్‌ప్ల‌స్ క‌మ్యూనిటీ సేల్‌.. త‌గ్గింపు ధ‌ర‌ల‌కు వ‌న్‌ప్ల‌స్ ఫోన్లు, టీవీలు..!

భార‌త్‌లోని త‌న క‌స్ట‌మ‌ర్ల కోసం వ‌న్‌ప్ల‌స్ సంస్థ ప్ర‌త్యేకంగా సేల్‌ను నిర్వ‌హిస్తోంది. క‌మ్యూనిటీ సేల్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ గురువారం ప్రారంభం కాగా జూన్ 27వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో అనేక ర‌కాల వ‌న్ ప్ల‌స్ ఉత్ప‌త్తుల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కే క‌స్ట‌మ‌ర్లు కొనుగోలు చేయ‌వ‌చ్చు. వ‌న్‌ప్ల‌స్ ఫోన్లు, ఇయ‌ర్ ఫోన్లు, టీవీలను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ సేల్‌లో వ‌న్‌ప్ల‌స్ 9, 9ప్రొ, 9ఆర్ ఫోన్ల‌పై రూ.2499 నుంచి రూ.5వేల వ‌ర‌కు డిస్కౌంట్‌ల‌ను పొంద‌వ‌చ్చు. అమెజాన్‌, వ‌న్‌ప్ల‌స్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్స్‌, రిల‌య‌న్స్ డిజిట‌ల్‌, మై జియో స్టోర్స్‌, క్రోమా స్టోర్స్‌, ఇత‌ర సెలెక్టెడ్ స్టోర్స్‌లో ఈ ఆఫ‌ర్ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ల‌భిస్తాయి.

ఈ సేల్‌లో వ‌న్ ప్లస్ నార్డ్ సీఈ 5జి ఫోన్‌ను త‌గ్గింపు ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం కూడా అందుబాటులో ఉంది. ఇక వ‌న్‌ప్ల‌స్ టీవీ వై సిరీస్ మోడ‌ల్స్ పై రూ.1500 నుంచి రూ.4000 వ‌ర‌కు రాయితీల‌ను పొంద‌వ‌చ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుల‌పై ఈ ఆఫ‌ర్ ల‌భిస్తుంది.

వ‌న్‌ప్ల‌స్ స్మార్ట్ బ్యాండ్‌, ప‌వ‌ర్ బ్యాంక్‌, ఇత‌ర ఉత్ప‌త్తుల‌ను కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. వ‌న్‌ప్ల‌స్ రెడ్ కేబుల్ ప్లాన్ రూ.1499 కాకుండా రూ.999కు ల‌భిస్తుంది. ఇక మెంబ‌ర్స్ కొన్ని వ‌న్‌ప్ల‌స్ ఉత్ప‌త్తుల‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. అలాగే డిస్కౌంట్ వోచ‌ర్ల‌ను అందిస్తారు.