కేసీఆర్ తో సహా ఆ 5 గురు మంత్రులకు గుణపాఠం చెబుతా : ఈటల మరో వార్నింగ్

మాజీ మంత్రి బిజెపి నేత ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బిజెపి పార్టీ, ఆ నాయకులు వచ్చి హుజురాబాద్ లో బలోపేతం చేసారని.. హుజురాబాద్ లో ఎగిరే జెండా కాషాయ జెండా అని స్పష్టం చేశారు. హుజురాబాద్ 5 మంది మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పర్యటనకు చేస్తూ ఇష్టారీతిగా దుర్మార్గముగా చేస్తున్నారని మండిపడ్డారు. కుల సంఘాలు, ఆర్ ఎంపీ మహిళా సంఘాలను, వివిధ సంఘాలను పిలిపించుకుని బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు.

కాంట్రాక్టర్ల ను, సర్పంచ్ లను నాయకులను బెదిరిస్తున్నారని తెలిపారు. తనను ఓడ గొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని.. త్వరలోనే కెసిఆర్ తో సహ మీకు కూడా గుణపాఠం చెబుతానని హెచ్చరిం చారు ఈటల రాజేందర్. చిన్న, చిన్న ఇబ్బందులు ఉన్నా ప్రజలందరూ తనకు సహకరి స్తున్నారని.. కచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పారు ఈటల రాజేందర్. కాగా ఇవాళ హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇవాళ మండల ఇంచార్జీలను కూడా నియమించిన సంగతి తెలిసిందే.