అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 2 5జి స్మార్ట్ ఫోన్‌..!

-

వ‌న్‌ప్ల‌స్ సంస్థ వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 2 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్ లో విడుద‌ల చేసింది. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఫ్లుయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 1080 x 2400 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌ను క‌లిగి ఉంది. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఈ ఫోన్ డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది.

OnePlus Nord 2 5G smart phone launched in india

ఈ ఫోన్‌లో 3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. అందువ‌ల్ల 5జికి స‌పోర్ట్ ల‌భిస్తుంది. ఈ ఫోన్ 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఇందులో ల‌భిస్తుంది. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు.

ఈ ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతోపాటు 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ మోనో కెమెరాల‌ను కూడా అమ‌ర్చారు. ముందు వైపు 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు.

5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్ ల‌భిస్తుంది. ఈ ఫోన్ ధ‌ర వివ‌రాలు ఇలా ఉన్నాయి.

* వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 2 5జి ఫోన్ 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.27,999
* వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 2 5జి ఫోన్ 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.29,999
* వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 2 5జి ఫోన్ 12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.34,999

ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ఫోన్‌ల‌ను విక్ర‌యించ‌నున్నారు. అమెజాన్‌తోపాటు వ‌న్‌ప్ల‌స్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్స్, రిల‌య‌న్స్ డిజిట‌ల్‌, క్రోమా, బ‌జాజ్ ఎల‌క్ట్రానిక్స్‌, సంగీత మొబైల్స్ వంటి స్టోర్‌ల‌లో ఈ ఫోన్‌ను విక్ర‌యిస్తారు. అయితే ఆఫ్ లైన్ స్టోర్స్‌లో మాత్రం ఈ నెల 28వ తేదీ నుంచి ఈ ఫోన్లు ల‌భిస్తాయి. వీటిపై హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో రూ.1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news