ప్రముఖ డిజిటల్ వాలెట్ యాప్ పేటీఎం.. ఎస్బీఐతో భాగస్వామ్యం అయి రెండు కొత్త కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డులను లాంచ్ చేసింది. పేటీఎం ఎస్బీఐ కార్డ్, పేటీఎం ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్ పేరిట ఆ కార్డులు విడుదలయ్యాయి. వీటిని పేటీఎం తన యాప్ ద్వారా అందిస్తుంది. వీటిల్లో అనేక ఫీచర్లను అందిస్తున్నారు.
పేటీఎం ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్ కార్డు వార్షిక చార్జి రూ.1499. ఈ కార్డును తీసుకున్న వారికి రూ.750 విలువ గల పేటీఎం ఫస్డ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తారు. మరో రూ.750 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఏడాదిలో రూ.2 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక ఫీజును రద్దు చేస్తారు. పేటీఎం యాప్‌లో కార్డు ద్వారా ట్రావెట్, మూవీస్, మాల్ పర్చేసెస్ చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. పేటీఎం యాప్ లో చేసే ఇతర ఖర్చులకు 2 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. వేరే ఎక్కడైనా ఖర్చు చేస్తే 1 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తారు. 1 శాతం వరకు ఫ్యుయల్ సర్ చార్జ్ వెయివర్ ఉంటుంది. ఇవే కాకుండా ఎయిర్‌ట్రావెల్ బెనిఫిట్స్ ఉంటాయి. రూ.4 లక్షల ఖర్చుపై రూ.2వేల గిఫ్ట్ ఓవర్, రూ.6 లక్షల ఖర్చుపై రూ.4వేల గిఫ్ట్ వోచర్ అందిస్తారు.
పేటీఎం ఎస్బీఐ కార్డ్ వార్షిక ఫీజు రూ.499. దీనికి కూడా రూ.750 విలువ గల పేటీఎం ఫస్ట్ మెంబర్షిప్ ను ఉచితంగా అందిస్తారు. అయితే క్యాష్ బ్యాక్‌లు మాత్రం 3 శాతం, 2 శాతం, 1 శాతం వస్తాయి. రూ.1 లక్ష వరకు సైబర్ ఫ్రాడ్ ఇన్సూరెన్స్ ఉచితంగా లభిస్తుంది. ఇక ఈ రెండు కార్డులను దీపావళి నుంచి కస్టమర్లకు ఇష్యూ చేస్తారు. కస్టమర్లు పేటీఎం యాప్‌లో వీటికి అప్లై చేసుకోవచ్చు.