ఫ్లిప్‌కార్ట్‌లో పోకో డేస్ సేల్‌.. తగ్గింపు ధ‌ర‌ల‌కు పోకో ఫోన్లు..

Join Our COmmunity

పోకో కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో పోకో డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ గురువార‌మే ప్రారంభం కాగా ఈ నెల 6వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా పోకో కంపెనీకి చెందిన ఫోన్ల‌ను తగ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే యాక్సిస్ బ్యాంకు కార్డుల‌తో ఫోన్ల‌ను కొంటే డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ల‌ను అందిస్తారు.

poco days sale in flipkart offers discounts on poco phones

సేల్‌లో పోకో ఎక్స్‌3 స్మార్ట్ ఫోన్ కేవ‌లం రూ.15,999 ధ‌ర‌కే ల‌భిస్తోంది. అలాగే పోకో సి3 స్మార్ట్ ఫోన్‌ను రూ.6,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పోకో ఫోన్ల‌పై 5 శాతం క్యాష్ బ్యాక్‌ను పొంద‌వచ్చు. అదే యాక్సిస్ బ్యాంక్ బ‌జ్ క్రెడిట్ కార్డుతో 10 శాతం అద‌న‌పు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. మ‌రిన్ని వివ‌రాల‌కు యూజ‌ర్లు ఫ్లిప్‌కార్ట్‌లో పోకో డేస్ స్టోర్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

కాగా పోకో ఎక్స్‌3 ఫోన్‌ను ఇటీవ‌లే ఆ కంపెనీ విడుద‌ల చేయ‌గా దానికి వినియోగ‌దారుల నుంచి విశేష రీతిలో స్పంద‌న ల‌భిస్తోంది. ఆ ఫోన్‌ను చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ఇక సేల్‌లో ఈ ఫోన్ త‌గ్గింపు ధ‌ర‌కు ల‌భిస్తుండ‌డం విశేషం. ఇందులో స్నాప్‌డ్రాగ‌న్ 732జి ప్రాసెస‌ర్‌, 64 మెగాపిక్స‌ల్ కెమెరా, ఆండ్రాయిడ్ 10, ఐపీ53 రేటింగ్‌, గేమ్ ట‌ర్బో మోడ్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.

TOP STORIES

మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో తడబడుతున్నారా? ఈ విషయాలు తెలుకోండి..

పెళ్ళి.. ఇద్దరి జీవితాలను ఒకటి చేసేది. ఇద్దరు వ్యక్తులను ఒకే దారిలో నడిపేది. మానవుడు అభివృద్ధి చెందుతున్న పరిణామ క్రమంలో పెళ్ళనేది అతడు సృష్టించుకున్న అత్యంత...