మురుగదాస్ కు హాలీవుడ్ ఫిలిం చేసే సీనుందా..?

-

కోలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే డిస్కషన్ .మురుగదాస్ హాలీవుడ్ ఫిలిం చేస్తున్నాడట.అది కూడా డిస్నీ వారితోటి.కోలీవుడ్లో మురగదాస్ ను మించిన దర్శకులు ఎంతోమంది ఉండగా ఈయననే డిస్కీవారు ఎందుకు కన్ సల్ట్ చేసినట్లు.ఇప్పుడిదే డిస్కషన్ కోలీవుడ్ సర్కిల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

సౌత్ సినీ పరిశ్రమలో మురుగదాస్ కంటూ ఓ గుడ్ విల్ ఉంది.గజినీతో మొదలుపెట్టి స్టాలిన్,కత్తి,తుపాకీ,సెవెంత్ సెన్స్, స్పైడర్ లాంటి విభిన్న కథాంశాలను తెరకెక్కించాడు.ప్రతి సినిమా ఎంతో క్యూరియాసిటీతో తీర్చిదిద్దాడు.అలాగే సక్సెస్ రేట్ ఎక్కువ నమోదు చేశాడు.దీంతో బిటౌన్ లోను గజినీ రీమేక్ చేసి మంచి టెక్నీషియన్ గా శభాష్ అనిపించుకున్నాడు.

మురగదాస్ …సౌత్ తో పాటు బాలీవుడ్ ను కవర్ చేశాక ఇక హాలీవుడ్ వరకు వెల్తాడని ఎవ్వరూ ఊహించలేదు.డిస్నీతో డిస్కషన్స్ లో లైవ్ యాక్షన్ ప్యాక్ చేయాలని డిసైడ్ అయినట్లుగా చెన్నైలో రూమర్లు అయితే రౌండ్లు కొడుతున్నాయి.ఒకవేల ఇదే నిజమైతే … మురగదాస్ ను మించిన టెక్నికల్ డైరెక్టర్స్ కోలీవుడ్లో చాలామందే ఉన్నారని మాట వస్తుంది.శంకర్ తో మొదలుపెడితేగౌతమ్ మీనన్ వరకు ఎవరికి వారే తోపులు .టేకింగ్ లో గౌతమ్ మీనన్ లాంటి వారు హాలీవుడ్ కు తీసిపోని విధంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.అలాంటిది ఏం చూసి మురగదాస్ కు ఆఫర్ ఇస్తారు అనే మాట మెదులుతుంది.

మురగదాస్ ప్రధాన బలం కాన్సెప్ట్ లను ఎంచుకోవడం.ఇది ఇప్పుడున్న ఏ దర్శకుడికి అక్కడ లేదు.బహుశా అదే యాంగిల్లో మురగదాస్ కు ప్రయారిటీ వచ్చి ఉండొచ్చనే మాటలు వినిపిస్తున్నాయి.ఐతే గజినీ,సెవంత్ సెన్స్ తర్వాత అంతటి మార్కెట్ చేంజర్ సినిమాలను రూపొందించిన దాఖలాలు ఈ డైరెక్టర్ కు లేవు.అయినప్పటికీ అవకాశం వచ్చిందంటే డైరెక్ట్ యాక్సెస్ తోనే ఇది సాధ్యమై ఉంటుందని అరవ బ్యాచ్ ఓ అంచనాకు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news