డిలీట్ చేసిన చాట్స్ ను తిరిగి పొందాలనుకుంటే.. వాట్సాప్ లో ఈ ఫీచర్ ను ఉపయోగించుకోండి..!

-

మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు పంపించడానికి వాట్సప్ ఎంతో అత్యవసరంగా మారింది. అయితే కొన్నిసార్లు మెసేజ్‌లు డిలీట్ చేసినప్పుడు లేదా చాట్‌ను మీరు డిలీట్ చేసినప్పుడు తిరిగి వాటిని పొందాలంటే ఇలా చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో పొరపాటున చాట్‌ను డిలీట్ చేయడం జరుగుతుంది, మరికొన్ని చాట్‌లను కావాలని మీరు తొలగిస్తారు. ఎప్పుడైనా వాటిని తిరిగి పొందాలనుకుంటే వాట్సప్ లో వాటిని రీస్టోర్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌ లో బ్యాకప్ చేసుకునే అవకాశాన్ని వాట్సప్ అందిస్తోంది.

ఎప్పుడైనా చాట్‌ ను డిలీట్ చేయకముందే బ్యాకప్ చేసుంటే ఆ చాట్‌ ను తిరిగి పొందవచ్చు. దీనిని ఉపయోగించడానికి, ముందుగా ఫోన్‌లోని వాట్సప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి, తిరిగి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి వాట్సప్‌ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా తిరిగి వాట్సప్‌ ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, మీ ఫోన్ నంబర్‌తో ధృవీకరించుకుని రిస్టోర్ అనే ఆప్షన్ కనిపించినప్పుడు దాన్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా చేస్తే వాట్సప్‌ లో చాట్ బ్యాకప్ చేసుకోవచ్చు.

ఈ విధంగా పూర్తి మెసేజ్‌లను రికవరీ చేసుకోవచ్చు. అయితే చాట్‌ లను డిలీట్ చేయకముందే బ్యాకప్ చేసుకున్న సందర్భాలలో మాత్రమే రికవరీ చేయగలరు. అయితే బ్యాకప్ గడువు ముగిసిన తర్వాత అందుకున్న లేదా పంపిన మెసేజ్‌లను తిరిగి పొందడానికి అవకాశం ఉండదు.ఈ బ్యాకప్ కోసం ముందుగా గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌ లో తగినంత స్టోరేజ్ స్పేస్ ఉండేలా చూసుకోవాలి. వాట్సప్ సెట్టింగ్స్‌ లో ఉండే బ్యాకప్‌ ను ఎనేబుల్ చేయడం వల్ల చాట్‌ లు ఆటోమేటిక్‌గా బ్యాకప్ అవుతాయి. తద్వారా డిలీట్ చేసిన చాట్‌ను ఎప్పుడైనా తిరిగి పొందడానికి వీలు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news