ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్.. గెలాక్సీ ఎస్21 సిరీస్‌లో మూడు కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ అన్ప్యాక్డ్ ఆన్లైన్ పేరిట నిర్వహించిన ఈవెంట్లో శాంసంగ్ ఈ ఫోన్లను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్21 5జి, ఎస్21 ప్లస్ 5జి, ఎస్21 అల్ట్రా 5జి పేరిట మూడు ఫోన్లను శాంసంగ్ విడుదల చేసింది. ఈ మూడు ఫోన్ల డిస్ప్లేలకు 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. దీంతో డిస్ప్లేల క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది.
గెలాక్సీ ఎస్21 5జి ఫోన్లో 6.2 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 64, 12, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 10 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ 128, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తోంది. 5జి, 4జి ఎల్టీఈ, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్ ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు.
గెలాక్సీ ఎస్21 ప్లస్ 5జి ఫోన్లో ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 6.7 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 12, 12, 64 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 10 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 5జి, 4జి ఎల్టీఈ, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 4800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్ ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ 128, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తోంది.
గెలాక్సీ ఎస్21 అల్ట్రా 5జి ఫోన్లో ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 6.8 ఇంచ్ క్యూ హెచ్డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, ఎస్ పెన్కు సపోర్ట్, స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 12, 16 జీబీ ర్యామ్, 108, 12, 10 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 40 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 5జి, 4జి ఎల్టీఈ, వైఫై 6ఇ, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ 128, 256, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తోంది.
ఈ మూడు ఫోన్లకు చెందిన ఆయా వేరియెంట్ల ధరలు భారత్‌లో ఇలా ఉన్నాయి.
* గెలాక్సీ ఎస్21 5జి 8జీబీ + 128 జీబీ – రూ.69,999
* గెలాక్సీ ఎస్21 5జి 8జీబీ + 256 జీబీ – రూ.73,999
* గెలాక్సీ ఎస్21 ప్లస్ 8జీబీ + 128జీబీ – రూ.81,999
* గెలాక్సీ ఎస్21 ప్లస్ 8జీబీ + 256జీబీ – రూ.85,999
* గెలాక్సీ ఎస్21 అల్ట్రా 5జి 12జీబీ + 256జీబీ – రూ.1,05,999
* గెలాక్సీ ఎస్21 అల్ట్రా 5జి 16జీబీ + 512జీబీ – రూ.1,16,999
ఈ ఫోన్లకు గాను బుకింగ్స్ శుక్రవారం నుంచే ప్రారంభం అయ్యాయి. జనవరి 25వ తేదీ నుంచి ప్రీ బుకింగ్ కస్టమర్లకు ఈ ఫోన్లను డెలివరీ ఇస్తారు. జనవరి 29వ తేదీ నుంచి ఇతర కస్టమర్లకు కూడా ఈ ఫోన్లను డెలివరీ చేస్తారు.
ఫోన్లను ప్రి బుకింగ్ చేసుకునే కస్టమర్లకు గెలాక్సీ స్మార్ట్ ట్యాగ్ ఉచితంగా లభిస్తుంది. అలాగే రూ.10వేల విలువైన శాంసంగ్ ఇ-షాప్ వోచర్ లభిస్తుంది. దీంతోపాటు కస్టమర్లు గెలాక్సీ వాచ్ యాక్టివ్ లేదా గెలాక్సీ బడ్స్ ప్లస్, ట్రావెల్ అడాప్టర్లను కాంబో ఆఫర్ కింద పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు హోల్డర్లకు ఎస్21 ఫోన్‌పై రూ.5వేలు, ఎస్21ప్లస్‌పై రూ.7వేలు, ఎస్21 అల్ట్రా ఫోన్‌పై రూ.10వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అప్‌గ్రేడ్ బోనస్ రూ.5వేల వరకు ఇస్తారు.