ఎస్‌బీఐ ఆఫర్.. డెబిట్ కార్డుతో ఈఎంఐలో వస్తువులను కొనవచ్చు..!

-

ఎస్‌బీఐ కస్టమర్లు క్రెడిట్ కార్డులతో పనిలేకుండా కేవలం డెబిట్ కార్డులతోనే ఈఎంఐలో వస్తువులను ఇప్పుడు కొనుగోలు చేయవచ్చు. అందుకు గాను కస్టమర్లు మంచి ఆర్థిక స్థితితోపాటు చక్కని క్రెడిట్ హిస్టరీ కలిగి ఉండాలి.

భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) దసరా, దీపావళి పండుగల సందర్భంగా తన కస్టమర్లకు తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు కేవలం యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు మాత్రమే డెబిట్ కార్డు ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సదుపాయం ఎస్‌బీఐలోనూ అందుబాటులోకి వచ్చింది. ఎస్‌బీఐ వినియోగదారులు ఈఎంఐలో వస్తువులను కొనాలంటే.. ఇకపై క్రెడిట్ కార్డులను వాడాల్సిన పనిలేదు. కేవలం డెబిట్ కార్డు ఉంటే చాలు.. తమకు నచ్చిన వస్తువులను ఈఎంఐ విధానంలో కొనుగోలు చేయవచ్చు.

ఎస్‌బీఐ కస్టమర్లు క్రెడిట్ కార్డులతో పనిలేకుండా కేవలం డెబిట్ కార్డులతోనే ఈఎంఐలో వస్తువులను ఇప్పుడు కొనుగోలు చేయవచ్చు. అందుకు గాను కస్టమర్లు మంచి ఆర్థిక స్థితితోపాటు చక్కని క్రెడిట్ హిస్టరీ కలిగి ఉండాలి. తాము ఈ సదుపాయానికి అర్హులమని అనుకునే వారు 567676 నంబర్‌కు DCEMI అని తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఎస్‌ఎంఎస్ పంపి తమ అర్హతను చెక్ చేసుకోవచ్చు. దీంతోపాటు తమ డెబిట్ కార్డు ఈఎంఐ క్రెడిట్ లిమిట్ వివరాలు కూడా తెలుస్తాయి. ఈ క్రమంలోనే కస్టమర్లు ప్రస్తుతం తమ ఎస్‌బీఐ డెబిట్ కార్డుల ద్వారా ఈఎంఐ విధానంలో వస్తువులను కొనుగోలు చేసి 6 నుంచి 18 నెలల వరకు తమకు తోచినన్ని నెలలు ఈఎంఐ పెట్టుకోవచ్చు.

ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఈఎంఐ ఫెసిలిటీ ఉన్న వారు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈఎంఐ విధానంలో వస్తువులను కొనుగోలు చేయవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న 1500కు పైగా నగరాలు, పట్టణాల్లోని 40వేలకు పైగా మర్చంట్ల వద్ద ఈ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలో వినియోగదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఎస్‌బీఐ విజ్ఞప్తి చేస్తోంది. మరింకెందుకాలస్యం.. మీకు కూడా ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉంటే మీరు ఆ ఆఫర్‌కు అర్హులవుతారో, కారో వెంటనే తెలుసుకోండి మరి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version