స్నాప్ డీల్‌ ‘సంజీవని’ యాప్‌ ద్వారా ప్లాస్మా.. రిజిస్ట్రేషన్‌ చేసుకోండిలా

-

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆక్సిజన్, బెడ్ల కొరత వేధిస్తోంది. అలాగే, ప్లాస్మా పొందలేక ఇబ్బంది పడుతున్నారు.  కొందరు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వస్తున్నా, అది అసలైనవారికి చేరడం లేదు. ప్లాస్మా అవసరాలు తీర్చడానికి స్మాప్‌డీల్‌ లక్ష్యంగా తీసుకుంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఈ కామర్స్‌ స్నాప్‌డీల్‌ ‘సంజీవని’ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌ ద్వారా బాధిత కుటుంబాలు సులభంగా దాతల వివరాలు పొందగలుగుతారు. దీనివల్ల చిన్న నగరాలు, పట్టణాల ప్రజలు కూడా ప్రయోజనం పొందవచ్చు. ఈ ప్లాట్‌ ఫామ్‌ను స్నాప్‌డీల్‌ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ సహాయంతో ఉపయోగించవచ్చు.  ఈ యాప్‌ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.


రిజిస్ట్రేషన్‌ విధానం

ప్లాస్మా కోసం ముందుగా ఈ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్లాస్మా అవసరమున్న రోగులు, ప్లాస్మా దానం చేయాలనుకునే వ్యక్తులు ఇద్దరూ ‘సంజీవని’ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రోగులు, దాతలు ఇద్దరూ తమ మొబైల్‌ నంబర్లతో నమోదు చేసుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌లో దాత తన బ్లడ్‌ గ్రూప్‌, అడ్రస్‌ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.

అలాగే, కరోనా వచ్చిన వారు తమకు కోవిడ్‌ ఎప్పుడు సోకింది? వారి ప్రస్తుత ఆరోగ్య స్థితి వంటి ముఖ్యమైన సమాచారాన్ని సంజీవని యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత, స్నాప్‌డీల్‌ రోగి సమీపంలోని ప్లాస్మా దాత వివరాలను తెలియజేస్తుంది. అప్పుడు వారికి ఫోన్‌ చేసి సదరు బాధితులు ప్లాస్మా కోసం అభ్యర్థించవచ్చు. మొదట స్నాప్‌డీల్‌ కేవలం తమ ఉద్యోగుల కోసమే సంజీవని యాప్‌ను ప్రారంభించింది. సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రజలందరికీ సహాయపడాలనే ఉద్దేశంతో దీన్ని దేశమంతటా తమ సేవలను అందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news