భలే భలే.. యోగా చేస్తోన్న టెస్లా రోబో.. ఇంకేం చేస్తుందో తెలుసా..?

-

టెస్లా సంస్థ ఇప్పటికే విద్యుత్‌ కార్లు, అటానమస్‌ కార్ల తయారీలో తనదైన ముద్ర వేసింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు ఈ సంస్థ రోబోటిక్ రంగంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే పలు రోబోలను రూపొందించింది. అయితే తాజాగా టెస్లా సంస్థ తయారు చేసిన భవిష్యత్‌ హ్యుమనాయిడ్‌ రోబో ‘ఆప్టిమస్‌’కు సంబంధించిన వీడియోను ఆదివారం తమ అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌)లో పంచుకుంది.

ఈ వీడియోలో హ్యుమనాయిడ్‌ రోబో యోగా చేస్తోంది. వస్తువులను గుర్తించి వాటిని ఓ క్రమ పద్ధతిలో సర్దుతోంది. మనిషి మధ్యలో కలగజేసుకొని ఏవైనా మార్పులు చేసి పనిని మరింత కష్టతరంగా మార్చినా.. రోబో దాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎలాన్ మస్క్ మామూలోడు కాదురోయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మస్క్ రోబోటిక్ రంగంలో అడుగుపెట్టాడంటే.. ఇక త్వరలోనే అందరూ తమ పర్సనల్ అసిస్టెంట్లుగా రోబోలను పెట్టేసుకోవడానికి రెడీగా ఉండండి అంటూ మరికొందరు అంటున్నారు.

ఈ వీడియోలో రోబో యోగాలో వివిధ రకాల భంగిమలను ప్రదర్శిస్తోంది. తన కాళ్లు, చేతులపై పూర్తి నియంత్రణను కలిగి ఉంది. టెస్లా కార్ల తరహాలోనే న్యూరల్‌ నెట్‌వర్క్‌ ద్వారా వీడియో ఇన్‌పుట్‌ను క్షుణ్నంగా సమీక్షించి తదనుగుణంగా ఔట్‌పుట్‌ను అందిస్తోంది. మరోవైపు ఈ వీడియోపై స్పందించిన టెస్లా అధినేత మస్క్.. హ్యుమనాయిడ్‌ రోబో తయారీలో పురోగతి సాధించినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news