సూపర్ సేఫ్టీ హెల్మెట్.. ఫీచర్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

-

బైక్, స్కూటీ లాంటి టూ వీలర్లో రోడ్ పై వెళుతున్నప్పుడు రైడర్లు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. హెల్మెట్ అనేది రైడర్‌కు ఆక్సిడెంట్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇంకా అంతేకాకుండా ఇది రైడర్‌ను ట్రాఫిక్ పోలీసుల చలాన్ నుంచి కూడా కాపాడుతుంది.రూ.500 నుంచి రూ.2 వేల దాకా పలు రకాల హెల్మెట్‌లు మనకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఎప్పుడైన బ్లూటూత్, ఎల్ఈడీ ఉన్న హెల్మెట్ చూశారా? అవును, నిజానికి ఈ రోజు మనం బ్లూటూత్, LED లతో పాటు అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్న అద్భుతమైన హెల్మెట్ గురించి తెలుసుకుందాం.

నిజానికి ఈ హెల్మెట్ అనేది స్టీల్‌బర్డ్ SBA 8 BT హెల్మెట్. ఇదొక ఫ్లిప్-అప్ హెల్మెట్, దీనిని పైకి తిప్పవచ్చు. ఇంకా దీనితో పాటు ఈ హెల్మెట్ చాలా అద్భుతమైన లక్షణాలను కలిగి ఉన్నందు వలన దీనిని హైటెక్ హెల్మెట్ అని కూడా పిలుస్తున్నారు. మార్కెట్‌లో ఈ హెల్మెట్ ధర దాదాపు రూ.3999లు ఉంటుంది. ఈ హెల్మెట్ మిమ్మల్ని చాలా రకాల ఇబ్బందుల నుంచి కూడా ఈజీగా రక్షిస్తుంది.స్టీల్‌బర్డ్ నుంచి వచ్చిన ఈ హెల్మెట్ ISI సర్టిఫికేట్ ని పొందింది. అంటే ఈ హెల్మెట్ అన్ని భద్రతా ప్రమాణాలకు కూడా ఎంతో అనుగుణంగా ఉంటుంది. ఇంకా ఇది కాకుండా, ఈ హెల్మెట్ ని అధిక నాణ్యత గల ABS షెల్ నుంచి కూడా తయారు చేశారు. ఇది ఫ్రంటల్ లేదా సైడ్ తాకిడి నుంచి రైడర్‌ను ఈజీగా రక్షిస్తుంది.

ఇంకా ఇది మాత్రమే కాదు, ఈ హైటెక్ హెల్మెట్‌లో మల్టీ-డెన్సిటీ EPS లైనింగ్ కూడా ఉంది. ఇది ప్రమాదాల సమయంలో షాక్‌ల నుంచి మిమ్మల్ని ఎంతో సురక్షితంగా ఉంచుతుంది.ఇంకా ఇవి మాత్రమే కాకుండా ఇది అత్యంత సౌకర్యవంతమైన హెల్మెట్ కూడా. ఈ కొత్త హెల్మెట్‌లో, మీకు స్వచ్ఛమైన గాలిని అందించే ఎయిర్ ఛానెల్‌లతో పాటు మల్టీ వెంట్లు కూడా ఉంటాయి. ఈ హెల్మెట్‌లో వెంటిలేటెడ్ ప్యాడింగ్ అనేది ఉంది. అందువల్ల ఇది దూర ప్రయాణాల్లో కూడా మీకు ఎంతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించగలదు.

ఇంకా ఇది కాకుండా, ఈ హెల్మెట్ ని శుభ్రం చేయడం కూడా సులభమైన పని.దీని డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అసలు హెల్మెట్ తీయకుండానే నీళ్లు, కూల్ డ్రింక్స్ తాగవచ్చని కంపెనీ తెలిపింది. ఎందుకంటే కంపెనీ ఇందులో ఫ్లిప్ అప్ సదుపాయాన్ని కల్పించింది. ఇంకా ఇది కాకుండా, ఈ హెల్మెట్‌లో బ్లూటూత్ కనెక్టివిటీని కూడా కంపెనీ అందించింది. అందుకే ఇది సుదూర ప్రయాణాలలో పాటలు వినడంలో మీకు ఎంతగానో సహాయపడుతుంది. ఇంకా అంతేకాకుండా, ఈ హెల్మెట్‌లో LED లైట్లు కూడా కంపెనీ అందించింది. పైగా ఇది మీకు రాత్రిపూట డిఫరెంట్ లుక్ ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news