తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు తొలిసారిగా చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. రాష్ట్ర బడ్జెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ విధానపరంగా లేదు. కొత్త ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇవ్వాలని అనుకున్నామని.. కానీ ఈ ప్రభుత్వానికి అసలు పాలసీనే లేదని బడ్జెట్ చూశాక అర్థమైందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉంది. భట్టి విక్రమార్క బడ్జెట్ ను నొక్కి చెప్పడం తప్ప ఏమీ లేదు. రాష్ట్రం మీద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద మాకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. ప్రతి అంశాన్ని కూలంకుషంగా వివరించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు కేసీఆర్. రైతులను పొగిడినట్టే పొగిడి.. వెన్నుపోటు పొడిచారని తెలిపారు. మాకు వ్యవసాయ స్థిరీకరణ పై పూర్తి అవగాహన ఉంది. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని రెండు పంటలకు మేము నీళ్ళు ఇచ్చామని తెలిపారు. బడ్జెట్ పై దళిత బంధు ప్రస్తావనే లేదని.. ప్రభుత్వం దళితుల గొంతు కోసిందని ఆరోపించారు. ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు కేసీఆర్.