గత ప్రభుత్వమే హింసను ప్రేరేపించింది : చంద్రబాబు

-

2019-2024 మధ్య కాలంలో ప్రభుత్వమే హింసను ప్రేరేపించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో శాంతి భద్రతల పై శ్వేత పత్రం విడుదల చేసిన అనంతరం ఆయన  మాట్లాడారు.  స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఏంటో గత ప్రభుత్వం చూపించింది. వైసీపీ కక్షపూరిత చర్యలకు పోలీసులు ఆయుధాలుగా మారారు. తమ మాట వినని పోలీసులను వెకెన్సీ రిజర్వ్ కు గత ప్రభుత్వం పంపించింది. ఐదేళ్లూ వీఆర్ లో ఉన్న పోలీసు అధికారులూ ఉన్నారు.  నా మీద చిన్నప్పుడు నుంచి ఒక్క కేసు కూడా లేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక నాపై 17, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు పెట్టారు.

పవన్ రోడ్డు మీద పడుకుని నిరసన తెలియచేసే పరిస్థితి కల్పించారు.  స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బోండా ఉమ, బుద్దా వెంకన్నను అడ్డుకున్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకున్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు రాజమండ్రిలో వంతెన కూడా మూసేశారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేశారు.  ధూళిపాళ నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు. ఆదిరెడ్డి అప్పారావు, పత్తిపాటి పుల్లారావు వంటి కుటుంబాలను ఇబ్బంది పెట్టారు. స్పీకర్ అయ్యన్న పై కేసులు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టి కోడెలను అవమానించారు.  ఆ అవమానంతోనే కోడెల ఊరేసుకుని ఆత్మహత్య చేసుకునేలా చేశారని తెలిపారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news