ఫేస్‌బుక్‌ను బీట్ చేసిన టిక్‌టాక్‌.. అత్య‌ధికంగా డౌన్‌లోడ్ అవుతున్న యాప్‌గా రికార్డు..

-

ప్ర‌ముఖ షార్ట్ వీడియో మెసేజింగ్ యాప్ టిక్‌టాక్ రికార్డు సృష్టించింది. 2020లో ప్ర‌పంచ‌లో అత్య‌ధికంగా డౌన్‌లోడ్ అయిన యాప్‌ల‌లో టిక్‌టాక్ మొద‌టి స్థానంలో నిలిచింది. ఈ క్ర‌మంలో ఫేస్‌బుక్‌ను టిక్‌టాక్ బీట్ చేసింది. ఈ మేర‌కు యాప్ అన్నీ అనే సంస్థ నివేదిక‌ను వెల్ల‌డించింది.

ఇక ప్ర‌ముఖ వీడియో కాన్ఫ‌రెన్సింగ్ యాప్ జూమ్ ఈ జాబితాలో ఏకంగా 219 స్థానాలు ఎగ‌బాకి నంబ‌ర్ 4 స్థానానికి చేరుకోవ‌డం విశేషం. వాట్సాప్ ఈ జాబితాలో 3వ స్థానంలో ఉంది. కాగా టిక్‌టాక్ యాప్‌కు గాను వచ్చే ఏడాది వ‌ర‌కు 100 కోట్ల మంది యాక్టివ్ యూజ‌ర్లు ఉంటార‌ని అంచ‌నా.

కాగా ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రాం యాప్ ఆ జాబితాలో 5వ స్థానంలో నిల‌వ‌గా, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ 6వ స్థానంలో నిలిచింది. కాగా జూమ్ యాప్‌, గూగుల్ మీట్ యాప్‌ల‌ను ఉప‌యోగిస్తున్న వారి సంఖ్య ఈ ఏడాది భారీగా పెరిగింది. క‌రోనా నేప‌థ్యంలో ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన చాలా మంది ఈ రెండు యాప్‌ల‌ను ఎక్కువ‌గా వాడ‌డం మొద‌లు పెట్టారు. అందుక‌నే ఈ రెండు యాప్‌లు కూడా భారీ సంఖ్య‌లో డౌన్‌లోడ్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version