వన్ ప్లస్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ.. భారీ ఫీచర్లతో..!

-

మీరు ఏదైనా మంచి స్మార్ట్ టీవీ ని కొనాలని అనుకుంటున్నారా..? ఏ టీవీ కొనాలో తెలియడం లేదా..? అయితే లేటెస్ట్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ వన్ ప్లస్ Y1S Pro ని చూడండి. తాజాగా ఈ టీవీని విడుదల చేసారు. పైగా ధర కూడా తక్కువే. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ప్లస్ 4కే అల్ట్రా హైడెఫినేషన్ స్మార్ట్ టీవీ వన్ ప్లస్ వై 1ఎస్ ప్రో స్మార్ట్ టీవీ కొత్త బోర్డెర్ లెస్ డిజైన్ కలిగి వుంది. అలానే ఈ టీవీ కి డాల్బీ ఆడియో ని ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఈ టీవీ కి HDR 10+ వంటి భారీ ఫీచర్లను కూడా కంపెనీ ఇచ్చింది.

ఇక ఈ టీవీ ధర విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ టీవీని కేవలం 30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే కొనేయచ్చు. వన్ ప్లస్ Y1S Pro 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ రూ.29,999 ధరకే వచ్చేస్తోంది. మీరు డిస్కౌంట్ ని కూడా పొందొచ్చు. బ్యాంక్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 2,500 రూపాయల డిస్కౌంట్ వుంది. ఏప్రిల్ 11 నుండి ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ సేల్ కి అందుబాటులోకి రానుంది.

దీనిని మీరు అమెజాన్ లో కొనచ్చు. లేదు అంటే OnePlus.in, క్రోమా, జిఓ డిజిటల్, రిలయన్స్ డిజిటల్ మరియు అన్ని ఆఫ్ లైన్ స్టోర్స్ లో కూడా లభిస్తుంది. ఇక టీవీ ఫీచర్స్ ని చూస్తే.. ఈ 43 ఇంచ్ సైజులో 4K (3840×2160) రిజల్యూషన్ కలిగి వుంటుంది. గామా ఇంజిన్ తో HDR 10, HDR 10+ మరియు HLG సపోర్ట్ తో వచ్చింది ఇది.

అలానే ఈ టీవీ 24W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 10 OS తో పని చేస్తుంది. బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సాతో వంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కలిగి వుంది. వాయిస్ అసిస్టెంట్ 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా వుంది. ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, మీరా క్యాస్ట్, Wi Fi, బ్లూటూత్ 5.0 మరియు వన్ ప్లస్ కనెక్ట్ 2.0 తో ఈ టీవీ వుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news