వన్‌ప్లస్ 40 Y1 టీవీ ధర, ఫీచర్స్ వివరాలివే..!

-

మీరు మంచి స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఖచ్చితంగా వన్ ప్లస్ అందిస్తున్న ఈ ఈ స్మార్ట్ టీవీ గురించి చూడాల్సిందే. వన్ ప్లస్ 40 Y1 టీవీ ని విడుదల చేసింది. మరి ఇక దీని ధర స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ వంటి వివరాలను చూద్దాం. మరి ఇక ఈ టీవీకి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

 

ఈ టీవీ 40-అంగుళాల తో వచ్చింది. మూడు వైపులా స్లిమ్ బెజెల్స్‌తో 93.8 శాతం స్క్రీన్-టు-బాడీ వుంది. అలానే ఈ టీవీ 20W స్పీకర్లు కలిగి వుంది. ఆండ్రాయిడ్ టీవీ 9 ఆధారిత ఆక్సిజన్ ప్లేతో రన్ అవుతోంది ఇది. ఇక ఈ టీవీ ధర విషయానికి వస్తే.. వన్‌ప్లస్ టీవీ 40 Y1 ఇండియాలో రూ.23,999 ధర కలిగి వుంది. బ్లాక్ కలర్ లో ఈ టీవీ మనకి అందుబాటులో వుంది. జూన్ 1 నుండి వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా ఇది అందుబాటులో వచ్చింది.

వన్‌ప్లస్ టీవీ 40 Y1 ఆండ్రాయిడ్ టీవీ 9 ఆధారిత ఆక్సిజన్ ప్లేలో రన్ అవుతుంది. అదే విధంగా 93 శాతం DCI-P3 కలర్ స్పేస్ కవరేజీని ఇది కలిగి వుంది. 1920×1,080 పిక్సెల్స్, 93.8 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో స్లిమ్ బెజెల్స్‌ నిర్మాణంతో వన్‌ప్లస్ 40 Y1 టీవీ కలిగి వుంది. 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ని ఈ టీవీ కలిగి వుంది.

గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌కు యాక్సిస్ ను అందించే ఫీచర్ ను కలిగి ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లకు ఇది సపోర్ట్ ఇస్తుంది. ఇందులో సింగిల్-బ్యాండ్ 2.4GHz వై-ఫై, బ్లూటూత్ వి 5, ఈథర్నెట్ పోర్ట్, రెండు హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు మరియు రెండు యుఎస్‌బి పోర్ట్‌లు ఉన్నాయి. యాంటీ అలియాసింగ్, సౌండ్ లెస్, డైనమిక్ కాంట్రాస్ట్ మరియు కలర్ స్పేస్ మ్యాపింగ్ కూడా ఈ టీవీ కలిగి వుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news