యాదాద్రి కాదు.. యాదగిరిగుట్టగానే పిలవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపు నిచ్చారు. యాదగిరిగుట్టని సొంత ఆస్తి కాదన.. తెలంగాణ సిఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా పేరు మార్చి ప్రజల మనోభావాలను కేసీఆర్ దెబ్బ తీసాడని ఆమె మండిపడ్డారు.
తన సొంత భూమిలో ఆలయ నిర్మాణం చేసినట్టు, సొంత పార్టీ నాయకులను ఆలయ శంకుస్థాపనకు పిల్చుకున్నాడని అగ్రహించారు. తెలంగాణ రాష్ట్ర మొదటి పౌరురాలైన తమిళ సైను ఆలయ ప్రారంభోత్సవానికి అహ్వానించక పోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ దురహంకారానికి నిదర్శనమని ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు.
మహిళలను గౌరవించలేని కెసిఆర్ కు ముఖ్యమంత్రి కుర్చీ లో కూర్చునే అర్హత లేదని ఆమె మండిపడ్డారు. ఎంతో పురాతనమైన ఆలయ పేరు యాదగిరిగుట్టగానే పిలవాలని ఆమె కోరారు. ప్రజలు ఇచ్చిన దాన ధర్మాల వల్ల ఆలయ నిర్మాణం జరిగిందే తప్ప , తన జేబులో నుంచి ఖర్చు పెట్టలేదు అని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు.