బ్రౌజర్​లో ట్విటర్ వాడాలంటే.. ఇక నుంచి లాగిన్ అవ్వాల్సిందే

-

వెబ్​ బ్రౌజర్​లో లాగిన్ అవ్వకుండా ట్విటర్ ఖాతాలను వినియోగించే వారికి ఆ సంస్థ షాక్ ఇచ్చింది. ఇక నుంచి ట్విటర్ ఖాతాలు వినియోగించాలంటే కచ్చితంగా లాగిన్ అవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఆ దిశగా మస్క్ కొత్త టీమ్ చర్యలు చేపట్టి.. కొత్త రూల్​ను తీసుకువచ్చింది. ట్విటర్ ఖాతా లేని వారు కచ్చితంగా ఓ నయా ఖాతాను తెరవాల్సిందేనంటూ అసలు విషయం చెప్పుకొచ్చింది. ‘విపరీతమైన డేటా స్క్రాపింగ్’ కారణంగా ఇటువంటి అత్యవసర చర్యను తీసుకున్నట్లు ఎలాన్ మస్క్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఇది తాత్కాలిక చర్య అని స్పష్టం చేశారు.

అంకుర సంస్థల నుంచి అగ్రస్థాయి కంపెనీల వరకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ను ఉపయోగించే ప్రతీ సంస్థ.. ఖాతాల్లోని డేటాను ఉచితంగా తీసుకుంటున్నాయని మస్క్​ అన్నారు. దీని వల్ల సాధారణ యూజర్ డేటా దోపిడీకి గురవుతోందని తెలిపారు. ఏఐ ద్వారా జరిగే అనవసరమైన సెర్చింగ్​ను అరికట్టేందుకు తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల బయటి లింక్స్​, ఎంబేడెడ్స్​​ ద్వారా ట్విటర్ ఖాతాల్లోని డేటాకు ఎటువంటి హాని కలగదని.. తమ వద్దనున్న డేటా సురక్షితంగా ఉంటుందని ట్విటర్​ సంస్థ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version