మీ ఐఫోన్‌ స్లో అయితే ఇలా చెయ్యండి.. సూప‌ర్ ఫాస్ట్ అవుతుంది

-

ఏ ఫోన్లు, గ్యాడ్జెట్లైనా మొదట్లో చాలా స్పీడ్‌గా పనిచేస్తాయి. కానీ, రానురాను వాటి పనితీరు తగ్గిపోతుంది. ఇందుకు ఐఫోన్స్‌ మినహాయింపేమి కాదు. ఏ వ‌స్తువునైనా స‌రైన ప‌ద్ద‌తిలో ఉప‌యోగించ‌క‌పోతే మొరాయించ‌క మానవు. మ‌రి ఐఫోన్ ను సూప‌ర్ స్పీడ్‌గా మార్చ‌డం ఎలాగో చూద్దాం.

మొదట ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. జనరల్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అక్కడ స్టోరేజ్‌ సెపరేట్‌ సెక్షన్లలో కనిపిస్తుంది. తరువాత అవసరంలేని స్టోరేజ్‌ ను డిలీట్‌ చేసుకోవచ్చు. దీనికి ముందుగా అనవసర ఫోన్‌ అప్లికేషన్లను తొలగించేస్తే.. అవసరమైన స్టోరేజీ ఏర్పడుతుంది.

ఒక్కొక్కసారి ఒక్కొక్క వెబ్‌ పేజ్‌ కోసం 10–100 ఎంబీ వరకు స్టోర్‌ చేస్తుంది. ఇలా బ్రౌజర్‌ మాత్రమే కాదు తరచూ వినియోగించే గూగుల్‌ మ్యాప్స్, ఇన్‌ స్ట్రాగామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి అప్లికేషన్లు కూడా చాలా క్యాచీ డేటాను కలెక్ట్‌ చేస్తాయి. దీనివల్ల ఫోన్‌ స్టోరేజ్‌ పెరిగిపోయి ఫోన్‌ స్పీడ్‌ తగ్గిపోతుంది. అప్పుడప్పుడు ఈ అప్లికేషన్ల క్యాచీ కూడా డిలీట్‌ చేస్తూ ఉండండి.

పైన పేర్కొన్న చిన్న‌పాటి టిప్స్‌ పాటిస్తే మీ ఫోన్‌ పర్ఫామెన్స్‌ మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఫోన్‌ బ్యాటరీ తగ్గిపోయే యాప్‌లను కూడా అవసరం లేకున్నట్లయితే వాటిని డిలీట్‌ చేయడమే మేలు. ఫోన్‌ స్టోరేజీ క్లీన్‌ చేయడానికి ఇతర యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయడం కంటే ఫోన్‌లోనే అందుబాటులోనే ఉన్నా… అప్లికేషన్స్‌తోనే క్లీన్‌ చేసుకోవడం మేలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version