గుప్పెడంతమనసు ఎపిసోడ్ 301: జగతి ఇంట్లో కలిసి భోజనం చేసిన రిషీ- వసుధారలు..నువ్వే ఒక గెస్ట్ వి, మళ్లీ ఇంకోకరిని ఎలా పిలుస్తావ్ అని జగతి ఫైర్

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసూ వంటగదిలో పాలు కాస్తూ ఉంటుంది. రిషీ కూడా బుక్ తీసుకుని వంటగదిలోకి వస్తాడు. బుక్ లో టిక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ధరణీ కాల్ చేస్తుంది. రిషీ హలో వదినా చెప్పండి అంటే..దేవయాని తీసుకుని నాన్న రిషీ నేను పెద్దమ్మను మాట్లాడుుతన్నాను అంటుంది. మీరేంటి వదిన ఫోన్ నుంచి చేశారు అంటే..నాకు ఫోన్ లో ఛార్జింగ్ లేదు అని..ఎలా ఉన్నావు నాన్న, వానకు తడిచావు కదా, హెల్త్ ఎలా ఉంది అని అడుగుతంది. నేను బానే ఉన్నాను పెద్దమ్మ అంటాడు రిషీ. పొద్దున్నే వెళ్లిపోయావు ఏంటి నాన్న అంత అర్జెంట్ పని అని అడుగుతుంది. అదే టైంకి వసూ సార్ కాఫీనా టీ నా అని అరుస్తుంది. అది దేవయాని వింటుంది. రిషీ హుష్ అని వసూకి సైగ చేస్తాడు. దేవయాని ఎవరిది నాన్న ఆ గొంతు, ఏదో మాట వినపించింది అంటే..రిషీ నేను మళ్లీ మాట్లాడతాను అని కాల్ కట్ చేస్తాడు.

వసూ దగ్గరకు వచ్చి ఏంటి నువ్వు కాఫీ హా టీ అని అడుగుతావు, అసలు నేను నిన్ను అడిగానా, ఇది ఏమైనా రెస్టారెంట్ అనుకుంటున్నావా అని తిడతాడు. అంటే మీకు కాఫీ అంటే ఇష్టం కదా అని వసూ అంటే..నాకు ఏది వద్దూ..బాగా ఆకలేస్తుంది. భోజనం చేయ్ అంటాడు. వసూ ఏంటి సార్ మీరు..క్షణాల్లో చేస్తాను అని డాబు పోతుంది. అలా కాసేపు మాట్లాడుకుంటారు. ఇంకోవైపు జగతి, మహేంద్ర నడుచుకుంటూ వస్తూ..జగతీ రిషీ ఇంకా రాలేదు, ఫోను చేసి రమ్మంటే వద్దన్నావు అని మహేంద్ర అంటాడు. జగతి రిషీని ఒక పనిచేసే యంత్రంలా చూడకు, ఇంతపెద్ద కాలేజ్ క ఎండీగా ఉండటం అంటే..చెప్పటానికి, వినటానికి బానే ఉంటుంది. కానీ ఆ ప్రజర్ తనకే తెలుస్తుంది అంటూ మాట్లాడుతుంది. ఇంతలో ధరణీ ఫోను నుంచి దేవయాని కాల్ చేస్తుంది. జగతి ధరణి కాల్ చేస్తుంది అనుకుని తీస్తుంది.. ధరణి రిషీ ఎక్కడున్నాడు అని అడిగితే..కాలేజ్ లో లేడు అని చెప్తుంది. మీరు ఎక్కడున్నారు అంటే..కాలేజ్ లో ఉన్నాను అని చెప్తుంది. దేవయాని కట్ చేస్తుంది.

ఇదేంటో మాట్లాడుతుంటేనే కట్ చేస్తుంది. రిషీ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని చెప్తుంది. అలా కాసేపు మాట్లాడుతుంది. ఇటుపక్క వసూ ఇంకా వండేదగ్గరే ఉంటుంది. రిషీతో ఏం తింటారో చెప్పండి అంటుంది. వసూ ఇది తింటారా అది తింటారా అని హడావిడి చేస్తుంది. ఫైనల్ గా రిషీ ముద్దపప్పు, ఆవకాయ, పప్పుచారు, అప్పడాలు, పెరుగు, ఉప్పు చాలు అంటాడు. ఇంత సింపుల్ భోజనమా అని సరే చేసేద్దాం అంటుంది వసూ. చేసేద్దామా అంటే..అవును ఇద్దరు కలిసి చేసేద్దాం అంటుంది. రిషీకి ఉల్లిగడ్డలు కోయమని తను గోంగూర తీస్తుంది. అసలు పప్పుచారుకి గోంగూరతో ఏంటి పనో. ఉల్లిపాయలు కోయలేక రిషీ కల్లలో నీళ్లు వస్తాయి. నేను కోయలేను అంటే. సరే అని వసూయే తీసుుకుని కట్ చేసి వంట చేస్తుంది. వసూని చూస్తూ…ఏడుస్తుంది, నవ్వుతుంది, బాదపడుతుంది..అన్నీ ఎమోషన్స్ ఉంటాయి. కానీ నాకు అనుకుని ఒకప్పుడు తనకోసమే కిచెన్ లోకి వచ్చాను, మళ్లీ ఇప్పుడు కూడా అనుకుంటా‍డు

మొత్తానికి వంట అయిపోతుంది. వసూ రిషీకి వడ్డిస్తుంది. రిషీ వసూకి వడ్డిస్తాడు. ఇద్దరూ పక్కపక్కన కుర్చోని తింటారు. వసూ చేతికి ఉన్న ఆ రింగ్ రిషీ చూస్తాడు. ఇది జగతి మేడమ్ ఇచ్చారు సార్ అంటుంది. వసూ రిషీని అలా చూస్తూ ఉండిపోతుంది. రిషీ సార్ వచ్చి అడిగిమరీ వడించుకుని తిన్నారని జగతి మేడమ్ కి తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అనుకుంటుంది. ఇంకోపక్క జగతి, మహేంద్రలు కారులో వస్తుంటారు. ఏంటి జగతి అలా ఉన్నావు అని మహేంద్ర అడిగితే..జగతి ఏదో సమాధానం ఇస్తుంది. నీతో నీ కొడుకుతో మాట్లాడటం కష్టం అని మహేంద్ర అంటాడు. మధ్యలో నా కొడుకుని ఎందుకు లాగుతున్నావు అని జగతి అంటుంది ఎపిసోడ్ అయిపోతుంది.

తరువాయిభాగంలో రిషీ వసూకి థ్యాంక్స్ చెప్తే..నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్..జగతీ మేడమ్ ఇంట్లో మీరు అడిగిమరీ వడ్డించుకుని తిన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది వసూ. మనోడి ముఖం మాడిపోతుంది. ఇంకోసీన్ లో జగతి డైనింగ్ టేబుల్ దగ్గర నుల్చుని ఉంటుంది. వసూ రిషీ సార్ వచ్చారు, తిన్నారు అని చెప్తుంది. నువ్వే మా ఇంట్లో గెస్ట్ వి, నువ్వు మళ్లీ ఇంకో గెస్ట్ ని పిలుస్తావా, మీ అంతట మీరు వంటచేసుకుంటారు, తింటారు..నేను వచ్చి కంచాలు చూసి గుర్తుపట్టి అడగాలా ఏం అనుకుంటున్నావ్ అని సీరయస్ అ‌వుతుంది. రిషీ సార్ హే కదా మేడమ్ అని వసూ అంటంది. అయితే అని జగతి అంటుంది. జగతి ఏంటో ఇలా మాట్లాడుతుంది. రేపు చూద్దాం..

Read more RELATED
Recommended to you

Latest news