బిగ్ బ్రేకింగ్ : మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న జగన్ ప్రభుత్వం

మూడు రాజధానులు విషయం పై జగన్ మోహన్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించు కుంటున్నట్లు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు మూడు రాజధానులు బిల్లు ను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తరఫు  అడ్వకేట్ జనరల్ తెలిపారు.  మూడు రాజధానులు అంశం పై ఏపీ హైకోర్టు లో గత కొద్ది రోజులుగా విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే నేటి వాదో పవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహటించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తరఫు  అడ్వకేట్ జనరల్.  ఇదే అంశం పై కాసేపటి క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  సచివాలయంలో  అత్యవసర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడు రాజధానులు విషయం పై చర్చ జరిగింది. మూడు రాజధానులు బిల్లు ను ఉపసంహరించు కోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇక దీనిపై మరికొన్ని నిమిషాల్లోనే సిఎం జగన్ అసెంబ్లీ లో ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.