మూడు రాజధానులు రద్దుపై స్పందించిన అమరావతి రైతులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కీలకమైన మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకుంది. వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డిఏ రద్దు బిల్లును కేబినెట్ రద్దు చేసుకున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు ఇవాళ తెలిపారు. హై కోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు ఆయన వివరాలను పేర్కొన్నారు. అయితే మూడు రాజధానులు రద్దు చేసుకుంటున్నట్లు మరికాసేపట్లో ఉన్న సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీని పై అమరావతి రైతులు స్పందించారు.

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లు వెనక్కి తీసుకోవడాన్ని పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు స్వాగతించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని తెలిపారు. ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని.. ఇన్నాళ్లు అమరావతి ని విమర్శించిన వాళ్ళు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులు బిల్లు వెనక్కి తీసుకుంటే సరిపోదని… ఏకైక రాజధాని అమరావతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు రైతులు.