కార్తీకదీపం ఎపిసోడ్ 1157: నిజం తెలుసుకున్న శౌర్య, హిమలు..జైల్లో ఉండే మరో ప్లాన్ వేసిన మోనిత

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో అమ్మమ్మాతాతయ్య అంటూ ఇద్దరు పిల్లలు సౌందర్య, ఆనంద్ రావులను హత్తుకుంటారు. సౌందర్య మీరేంట్రా ఇక్కడా, ఇండియాకి ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది. స్వప్న పిల్లలు అని కార్తీక్ కి చెపుతుంది. శౌర్య, హిమలు ఇండియా అంటే ఈ పక్షులు ఎక్కడ నుంచి ఎగిరివచ్చాయో, అయినా ఎంత క్లోస్ అయినా మనం హలో అంటే హలో, హాయ్ అంటే హాయ్ ఇలానే ఉందాం అనుకుంటారు. సౌందర్య కార్తీక్ వాళ్లకు పిల్లలను పరిచయం చేస్తుంది. ఒక్కరే వచ్చారు అమ్మరాలేదా అంటే మేము ఇక్కడే కొంచెం దూరంలో ఇళ్లు కొనుక్కాం..అమ్మ దూరం నుంచి ఇళ్లు చూపించింది వచ్చేశాం అంటారు. మా మీద మీ అమ్మకు ఇంకా కోపం పోలేదా అని కార్తీక్ అంటాడు. వీళ్ల మాటలు బట్టీ చూస్తే గతంలో ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లే అనిపిస్తుంది. ఆ పిల్లలు మాట్లాడే మాటలకు వెనక ఉన్న శౌర్య, హిమ వెక్కిరిస్తారు. దీపను మీరు అక్కఅత్తయ్య కదా అంటారు. అదేం పిలుపురా అని అందరు ఆశ్చర్యపోతారు.

మా అమ్మ మిమ్మల్ని అక్కలా అనిచెప్పింది. అందుకే మేము అలా ఫిక్స్ అయ్యాం అంటారు. బాగుంది అని దీప అంటుంది. ఇంతలో ఒకడు మీకు ఇద్దరు గాల్స్ అన్నారు, కనిపించటం లేదేంటి అంటే..సౌందర్య హిమ శౌర్యలను పిలిచి వాళ్లను మీ బావలు అని చెప్తుంది. ఆ మాటకు శౌర్య సడన్ గా ఈ బావలు ఎక్కడ నుంచి వచ్చారు అని అంటే సౌందర్య నా కూతురు పిల్లలు మీకు బావలే అవుతారు అంటుంది. ఆ తరువాత వాళ్ల పేర్లు చెబుతారు. ప్రేమ్, నిరుపమ్ అని అందరికి పరిచయం చేసుకుంటారు. సౌందర్య అక్షింతలు తీసుకుని రండ్రా పిల్లలు అంటుంది. ప్రేమ్, శౌర్య ఒకేసారి వెళ్లి కాళ్లు మొక్కుతారు. నిరుపమ్, హిమ ఒకేసారి మొక్కుతారు.దీన్ని బట్టి డాక్టర్ బాబుకి అళ్లుళ్లు వీళ్లేనేమో అనిపిస్తుంది.

ఇంకోవైపు జైల్లో మోనిత దగ్గరు ఆ సోడా సుకన్య వచ్చి పేపర్ లో మీ కథ చదివాను చాలా బాగుంది అంటుంది. ఎప్పటికైనా మీ ప్రేమ విజయం సాధిస్తుంది మేడమ్ అంటుంది. చిన్న కరెక్షన్..ఎప్పటికైనా కాదు..ఈ జైలు శిక్ష ఐపోగానే సాధిస్తాను అంటుంది. ఇద్దరు పిచ్చోల్లు మాట్లాడుకున్నట్లు ఒకళ్లకొకళ్లు ఏదో మాట్లాడుకుంటారు. మోనిత సుకన్య ఫోన్ తీసుకుని డాక్టర్ భారతికి ఫోన్ చేస్తుంది. ఏదో చెప్తుంది. లాస్ట్ కి థ్యాంక్యూ భారతి అంటుంది. పెద్ద స్కచే వేసినట్లుంది మోనిత.

ఇంట్లో హిమ ఒక్కతే మెట్లపై నిల్చుంటుంది. శౌర్య వెళ్లి అందరూ హ్యాపీగా ఉంటే నువ్వేంటి ఏంటి ఇక్కడ ఉన్నావ్ అని అడుగుతుంది. అందరూ హ్యాపీగానే ఉన్నారు మనం తప్ప అంటుంది హిమ. అలా ఎందుకు అనుకుంటావ్, మనమే హ్యాపీగా లేవేమో ఆలోచించు చూడు..నీకు నాన్నమీద కోపం వచ్చిందా అని అడుగుతుంది. హిమ..డాడీ అబద్ధాలు చెబుతున్నాడా మనకి, డాడీ మనల్ని మోసం చేస్తున్నాడా అని అడుగుతుంది. శౌర్య..నాకేం తెలుసు, నీకెంత తెలుసో నాకంతే తెలుసు అంటుంది. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటారు. అందరూ బానే ఉన్నారుగా..అంటే షైని చెప్పింది నిజం కాదేమో అని శౌర్య చెబుుతుంది. హిమ నేను మాట్లాడకపోతే నాన్న బాధపడతాడు కదా అని అడుగుతుంది. అవును నాన్నకు నువ్వంటేనే ఇష్టం నువ్వు మాట్లాడకపోతే ఏడుస్తాడు అంటుంది శౌర్య.

వెళ్లి ఇప్పుడే మాట్లాడతా అని హిమ అంటే..నాన్న కూడా అలిగే ఉంటాడు.. చిన్న గిఫ్ట్ కొనించి నాన్నను మచ్చిక చేసుకుందాం అని సలహా ఇస్తుంది. హిమ శౌర్య ఏం చెప్పినా తలాడిస్తుంది. డబ్బులు ఎలా అని అడిగుతుంది. శౌర్య నాతో రా అని హిమను తీసుకెళ్తుంది. మరోపక్క కార్తీక్ ఒంటరిగా మోనిత గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో సౌందర్య వచ్చి మాట్లాడుుతంది. ఇద్దరు ఆ రాక్షసి మోనిత గురించి మాట్లాడుకుంటారు. 11ఏళ్లు దీపకు దూరమయ్యాను, మనస్సాంతికి దూరమయ్యాను..ఇప్పుడు కొత్తగా ఈ న్యూస్ పేపర్ ఒకటి అంటాడు. సౌందర్య.. జైలుకి వెళ్లింది ఇంకా ఏం చేయగలదురా అంటుంది. అది పేరుకు మాత్రమే జైల్లో ఉంది, శిక్ష మనకే పడింది అని కార్తీక్ అంటాడు. సౌందర్య కార్తీక్ కు ధైర్యం చెప్పే మాటలు చెప్తుంది. కార్తీక్ మాత్రం పిరికిగా మాట్లాడతాడు..ప్రపంచం అంతా ఒక్కటై ఎ‌వ్వరు ఏమనుకున్నా ఓర్చుకోగలను కానీ నా ఇంట్లో నా పిల్లలు నన్ను చూసి మొఖం తిప్పుకుని వెళ్తుంటే..జీవితంలో మొదటిసారి చచ్చిపోవాలనిపిస్తుంది అంటాడు. సౌందర్య నా కొడుకునే ఇలా మాట్లాడేది..ధైర్యంగా ఉండు అంటుంది. కార్తీక్ దీప ముందు నేను ధైర్యంగా ఉన్నట్లు నటిస్తున్నాను మమ్మీ అంటాడు. సౌందర్య ఆ మోనిత ఏం చెయ్యలేక ఆఖరి అస్త్రంగా ఆ పేపర్ ని వాడుకుంది. అందరం కలిసి దాన్ని ఎదుర్కొందాం అంటుంది.

ఇటుపక్క శౌర్య హిమను తీసుకుని రూంలోకి వస్తుంది. నాన్నకు షట్ కొనిద్దాం అని చెప్పాను కదా..నానమ్మ, భాభై, తాతయ్య ఇచ్చిన డబ్బులను ఈ బెడ్ కింద కవర్లో పెడుతూ ఉంటాను..నా దగ్గర ఎన్ని డబ్బులు పోగయ్యాయో చూద్దాం అని బెడ్ పైకి లెపుతారు. ఆ న్యూస్ పెపర్ అక్కడే ఉంటుంది. దాన్ని పక్కన వేసి కవర్లో ఉన్న డబ్బులు లెక్కపెడతారు. అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో శౌర్య, హిమలు పేపర్ లో ఉన్న మోనిత ఫోటో చూసి నిజం తెలుసుకుంటారు. నాన్న మోనిత ఆన్టీనీ మోసం చేశాడా అని ఏడుస్తారు. దీప ముందా పేపర్ ని తగలపెట్టేశెయ్యాలి అనుకుంటూ వస్తుంది. అప్పటికే శౌర్య, హిమలు కిందకుర్చుని ఏడుస్తుంటారు. ఇంకో సీన్ లో కార్తీక్ పిల్లల దగ్గర కుర్చుంటే వాళ్లు లేచి వెళ్లిపోతారు. మరన్ని వివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version